రాజంపేట పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలి

0 10

– రాజంపేట సబ్ కలెక్టర్ గార్గ్

 

రాజంపేట ముచ్చట్లు:

 

- Advertisement -

రాజంపేట పట్టణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాజంపేట సబ్ కలెక్టర్ అన్నారు. బుధవారం స్థానిక రాజంపేట పట్టణ పరిధిలో పాత బస్టాండ్ నందు రాజంపేట మున్సిపల్ కమిషనర్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్, రాజంపేట ఆర్టిసి డిపో మేనేజర్ లతో కలిసి సబ్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ… రాజంపేట పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాలను సుందరీకరణ అధికారులు చేయాలని, ఇందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలన్నారు. తొలుత పట్టణ కూరగాయల మార్కెట్ వద్ద ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది కరంగా ఉందని రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోగా చాలా వరకు ప్రధాన రోడ్డు వద్ద, ఫుట్ పాత్ వద్ద ఆక్రమణకు గురి అయినట్లు ఈ ఆకస్మిక పరిశీలనలో తమ దృష్టికి వచ్చిందని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఆక్రమణలను తొలగించాలని అన్నారు.

 

 

 

అలాగే ప్రధాన రోడ్డు వద్ద, ఫుట్ పాత్ ల వద్ద పెయింట్ తో మార్కింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ప్రబలకుండా ప్రజలు అధిక సంఖ్యలో గుమికూడాకుండా ఉండాలని… భౌతిక దూరం పాటించాలని అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణ పాత బస్టాండ్ వద్ద అధిక ట్రాఫిక్ వల్ల బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని, ప్రజలు విరివిగా రోడ్డుపైనే నిలబడ్డం జరుగుతోందని బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజంపేట సుందరీకరణ కు అధికారులు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పట్టణ సీఐ చంద్రశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:The town of Rajampet needs to be beautified

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page