విశాఖలో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి?

0 3

అమరావతి  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద గ్రేహాండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత తో పాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.డీసీఎం కమాండర్‌గా కొనసాగుతున్న సందె గంగయ్య పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. సందె గంగయ్య స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్ మూడు 303, తపంచా ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడంతో వివరాలు బయటకు వచ్చేందుకు ఆలస్యమవుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌తో మన్యంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. పలువురు కీలక మావోయిస్టు నేతలు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో హెలికాఫ్టర్‌ సాయంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:Encounter in Visakhapatnam .. Six Maoists killed?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page