షర్మిలకు షాక్..

0 21

నల్గొండ ముచ్చట్లు :
ఇవాళ ఆమె నల్గొండ జిల్లాలో పలు ప్రాంతల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ క్రమంలో నీలకంఠ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో షర్మిల షాక్ తిన్నారు.వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించారు. మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. ఉదయం 7:30 గంటలకు లోటస్‌పాండ్‌ నుంచి నల్లగొండ జిల్లా పర్యటనకు షర్మిల బయల్దేరారు.బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం వైఎస్ షర్మిల హుజూర్‌నగర్‌లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. దీంతో షర్మిల తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

- Advertisement -

Tags:Shock to Sharmila ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page