సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు

0 8

విశాఖ  ముచ్చట్లు:
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించారు. గత ఏడాది మార్చి నెలలో అక్రమంగా చైర్మన్గా ప్రభుత్వం తొలగించింది. తిరిగి అశోక్ గజపతి రాజును చైర్మన్గా
నియమిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, మొదటి సారిగా దేవాలయంలో అశోక్ గజపతి రాజు స్వామివారిని దర్శించుకున్నారు.  అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు. పీవీజీ రాజు గారి విగ్రహానికి పూలమాల వేసి గోశాలలో మొక్కలునాటారు. సంచైత గజపతి నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో 15 నెలల తరువాత అశోక్ గజపతి రాజు అప్పన్న ను దర్శించుకున్నారు. అశోక్ గజపతిరాజును గతేడాది మార్చినెలలో ప్రభుత్వం అక్రమంగా ఆయన్ను చైర్మన్ పదవినుంచి తొలగించింది. తిరగి అశోక్ గజపతిరాజునుచైర్మన్ గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మొదటి సారిగా చైర్మన్ హోదాలో ఆయన ఈరోజు ఆలయానికి విచ్చేశారు.ఆయన  వెంట కుమార్తె  అదితి గజపతి రాజు కూడా ఉన్నారు.ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:Ashok Gajapathiraju visiting Simhachalam Lakshmi Narasimhaswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page