హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి

0 8

– సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణను కలిసిన బిసి సంఘాల నేతలు

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ బిసి సంఘాల నేతలు కోరారు.ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు  ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ప్రతినిదుల బృందం  రాజభవన్ లో చీఫ్ జస్టిస్ ను కలిసి తెలుగులో రూపొందించిన వినతి పత్రం సమర్పించారు.  ఉన్నత న్యాయస్థానాలలో రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా ఈ దేశంలో మొత్తం 78 శాతం జనాభా గల  BC/SC/ST ల ప్రాతినిధ్యం 10 శాతం దాటలేదని వివరించారు. ఈ దేశంలోని 56 శాతం జనాభా గల బిసి కులాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకుగాను ఈ క్రింది సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
సుప్రీం కోర్టు – హైకోర్టు జడ్జిల నియామకాలలో కూడా బిసి/ఎస్సీ/ఎస్టీలకు సామాజిక న్యాయం కల్పించే విధంగా ప్రతిపాదనలు పంపాలని తమరు ఇటీవల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు.అందుకుగాను తమరు చొరవ తీసుకొని ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
చట్టసభలలో-అసెంబ్లీ – పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ/ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండడం వలన వారి,వారి జనాభా ప్రకారం రాజకీయ వాటా లభిస్తుంది. బి.సిలకు విద్యా-ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఉన్నవి.

 

 

 

కాని రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయం స్పష్టంగా కన్పిస్తుంది. బీసీల జనాభా 56 శాతం ఉంటే రాజకీయ రంగంలో వారి వాటా ఇంతవరకూ 14 శాతం దాటలేదు. దేశంలో 2640 బిసి కులాలు ఉండగా 2600 బిసి కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఉండగా 14 రాష్ట్రాల నుంచి ఒక బీసీ పార్లమెంట్ సభ్యులు కూడా లేరు. సామాజిక వర్గాలైన ఎస్సీ/ఎస్టీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టి బీసీలకు పెట్టకపోవడం అన్యాయం. పైగా 74 సంవత్సరాల తర్వాత కూడా ఈ కులాల ప్రాతినిథ్యం పెరుగడం లేదు. ఇత తక్కువ ప్రాతినిథ్యం చూస్తే ఈ కులాలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ పెట్టడం లేదు. ఈ పరిస్థితులలో నోరులేని బీసీల పక్షాన న్యాయస్థానాలు జోక్యం చేసుకుని బీసీల వాటా ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలలో 2006 నుంచి బిసి రిజర్వేషన్లు  పెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం  స్కాలర్ షిప్ – ఫీజుల మంజూరు చేయలేకపోవడంతో పేద, అత్యంత వెనుకబడిన  కులాల విద్యార్థులు చదవలేకపోతున్నారు. I.I.T, I.I.M కోర్సులలో ఒక లక్ష నుంచి ఒక లక్షా 50 వేల వరకు ఫీజులు ఉన్నవి. అత్యంత వెనుకబడిన కులాల వారు ప్రత్యేకంగా చాకలి, మంగలి, వడ్డెర, మత్స్యకారులు, గొర్రెలకాపరులు, నేత కార్మికులు , గీత కార్మికులు తదితర కులాల పిల్లలు ఇంత పెద్ద మొత్తం ఫీజులు కట్టలేక సీట్లు వచ్చినా చదువు మానుకుంటున్నారు.  వీరికి ఆర్థికపరమైన స్కీములు మంజూరు చేసి చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పలు సార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  తమరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ ప్రతినిది వర్గంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, చంటి ముదిరాజ్,  సుచిత్ కుమార్, జయంతి, తదితరులు ఉన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Reservations should be enforced in the appointments of High Court-Supreme Court judges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page