7 కోట్ల నిధులతో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0 15

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని గొల్లకందుకూరు, సజ్జాపురం గ్రామాల రోడ్లు మరమ్మత్తుకు, ములుమూడి నుండి ఆమంచర్ల వరకు లింకు రోడ్డు నిర్మాణాలకు దాదాపు 7 కోట్ల రూపాయల నిధులతో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో పార్టీలకు, కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు  అందినప్పుడే పాలకులపై ప్రజలకు విశ్వాసం ఉంటుందన్నారు.  ఆమంచర్ల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ వాహనాల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్  జోక్యం చేసుకోవాలని కోరారు..పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు . గత 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తుంది అన్నారు. గ్రామీణ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. పార్టీలకతీతంగా గా గ్రామీణ నియోజకవర్గ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:MLA Kotamreddy laid the foundation stone for the development work with a fund of Rs 7 crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page