అంబానీ బాంబు బెదిరింపు కేసులో మరో అరెస్ట్

0 5

హైదరాబాద్   ముచ్చట్లు:
ముకేశ్ అంబానీ బాంబు బెదిరింపుల కేసులో ముంబయి మాజీ పోలీస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ కుమార్‌ శర్మ నివాసంలో ఎన్ఐఏ గురువారం ఉదయం ఆకస్మిక సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం 5 గంటలకు శర్మ నివాసానికి చేరుకున్న ఎన్ఐఏ, సీఆర్పీఎఫ్ బృందం.. ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించింది. అనంతరం విచారణ కోసం ప్రదీప్ శర్మను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న సంతోష్ షెలార్ అనే వ్యక్తితో ప్రదీప్ కుమార్‌కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ షెలార్, శర్మ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతుండగా.. అతడితో తనకు సంబంధాలున్నాయనే విషయాన్ని పోలీస్ అధికారి కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు, తనతో వేలాది మంది ఫోటోలు తీసుకుంటారని, అందులో ఇది కూడా ఒకటని చెప్పారు. తనతో నాకు ఎటువంటి లావాదేవీలు లేవని పేర్కొన్నారు.ఇదే కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న మరో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేకు ప్రదీప్ కుమార్ శర్మను గురువుగా కొందరు భావిస్తారు. వాజేను ఎన్ఐఏ ఏప్రిల్‌లో అరెస్ట్ చేసి విచారించింది.

 

ఆ సమయంలో ఓ అధికారి మాట్లాడుతూ.. ‘మన్‌సుఖ్ హిరేన్ కేసులో శర్మ కొంత సహకరించినట్టు కొన్ని ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రదీప్ ద్వారా అంబానీ నివాసం వద్ద నిలిపిన కారులో పేలుడు పదార్థాలను వాజే సేకరించినట్టు ఎన్ఐఏ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.అంబానీ బాంబు బెదిరింపులు, మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసులో వాజే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కేవలం వాజేతో సంబంధాలు మాత్రమే కాదు, నేరం జరిగిన తర్వాత ఇరువురూ సమావేశమైనట్టు సమాచారం అందినట్టు ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. వాజేను కాపాడటానికి ప్రదీప్ ప్రయత్నించినట్టు సూచనలు ఉన్నాయని తెలిపాయి.ఇదిలా ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు పోలీస్ అధికారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. శివసేన తరఫున పోటీచేసి ఓడిపోవడంతో ప్రస్తుతం ఓ ఎన్జీఓను నడుపుతున్నారు. అంబానీ బెదిరింపుల కేసులు సంతోష్ షెలార్‌తో పాటు ఆనంద్ జాదవ్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబయిలోని మలాద్ ప్రాంతంలో జూన్ 11న వీరిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Another arrest in Ambani bomb threat case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page