ఆటో డ్రైవర్ల పట్ల సేవా హృదయుడు దాతృత్వం

0 8

– ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన కార్పొరేటర్ పెంట రాజేష్

పెద్దపల్లి ముచ్చట్లు:

- Advertisement -

ఆటో డ్రైవర్ల పట్ల సేవా హృదయుడు దాతృత్వం చాటుకున్నారు. సుమారు 35 మంది ఆటోడ్రైవర్లకు రూ.20 వేల విలువ చేసే నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు 37వ డివిజన్ కార్పొరేటర్, సామాజిక సేవకులు ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో నిత్యావసర సరుకులను అందజేసి మాట్లాడారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూ ఆర్థికంగా ఎంతో నష్టాన్ని కలగజేసినది అని తెలిపారు. సామాన్యుల కుటుంబ పరిస్థితులు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్కర సమయంలో మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఈరోజు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని అన్నారు. ఆటోలు సరిగా నడవక కొందరు పస్తులు ఉంటున్నారు అనే విషయం తన మనసును కలచి వేసిందని తీవ్ర బాధను వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను, నిరుపేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెంట రాజేష్ పిలుపునిచ్చారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Service heart generosity towards auto drivers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page