ఇంటర్మీడిట్ కళాశాలల ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

0 2

జగిత్యాల ముచ్చట్లు:
రాష్ట్రంలో ఉన్న జూనియర్ కళాశాలల ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నివ్వాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(యూఎస్ఎఫ్ఐ) జగిత్యాల జిల్లా సహాయ కార్యదర్శి మొహమ్మద్ సుజాయిత్ అలీ పత్రికా ప్రకటన ద్వారా కొరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య అంటే తెలంగాణలో డబ్బున్న వారిదే చదువు అనే విధంగా  మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనిపైన ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల యజమాన్యల చేతిలో కీలుబొమ్మలుగా ఉండడం వల్లనే మౌనంగా ఉన్నారని వారు తెలిపారు. జూనియర్ కళాశాలకు ప్రవేశాలకు అనుమతించిన అధికారులు ఫీజులపై ఎందుకు ప్రకటన విడుదల చేయడం లేదని, దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటని అన్నారు. ఒక సంవత్సరానికి ఒక్కొక్క కళాశాలలో లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోనట్లు ఉండటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్య కోసం కళాశాలలు కళాశాల ఫీజు కాకుండా ఇతర ఫీజుల పేరుతో మెటీరియల్ ఫీజులనీ మరియు తదితర పేర్లుతో ఒక్క విద్యార్థి నుండి సంవత్సర కాలంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇది విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని అన్నారు. అలాగే తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని విద్యార్థుల చావుకు కారణం కూడా ఈ ఫీజులు అవుతున్నాయని అన్నారు.ఫీజుల పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి  ఫీజులపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:The state government should respond on the fees of intermediate colleges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page