ఈటలకు ఫ్యూచర్ ఏంటీ

0 14

కరీంనగర్ ముచ్చట్లు:
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆత్మగౌరవం నినాదం పేరిట ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హుజూరా బాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటం విశేషం. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని చాలా మంది ఇప్పటికీ తప్పుపడుతున్నారు.ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకు అదే రకమైన గుర్తింపు ఇచ్చింది. శాసనసభ పక్ష నేతగా, మంత్రిగా ఆయనకు అనేక అవకాశాలు కల్పించిందన్నది వాస్తవం. అయితే కేసీఆర్ పోకడలను సహించలేని ఈటల రాజేందర్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆ గ్యాప్ పెరిగి చివరకు తనను బర్త్ రఫ్ చేసే వరకూ దారి తీసింది. మొన్నటి వరకూ లెక్కలు గురించి మాట్లాడిన ఈటల రాజేందర్ ఇప్పుడు విలువలు మాట్లాడితే అర్థం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారని అందరూ భావించారు. కొత్త పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే ఈటల కొత్త పార్టీ పెడితే అనేక మంది నేతలు వచ్చి చేరేవారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాములు నాయక్ వంటి వారే కాకుండా కోదండరామ్ వంటి వారు కూడా తమ మద్దతును ప్రకటించేవారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకుండా ఉండేది. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన పక్కన ఉన్న నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు.బీజేపీలో చేరితే ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఉప ఎన్నికలలో గెలిచినా ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఉంటే కొంత ఇమేజ్ పెరిగి ఉండేదని, ఇప్పుడే బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్న సమయంలో ఈటల రాజేందర్ నిర్ణయం సరైంది కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో ఒక సామాన్య నేతగా మిగిలిపోక తప్పదన్న జోస్యాలు వినపడుతున్నాయి.

అభివృద్ధి  పనులకు 35 కోట్లు:

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక మొన్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఒక్క‌సారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌కు అన్ని పార్టీలూ స‌న్న‌ద్ధ‌మ‌వ‌తున్నాయి. అటు ఈటల బిజేపిలో చేరడంతో.. టీఆర్ఎస్ కాస్త డిఫెన్స్ లో పడింది. ఎలాగైనా ఈటలను ఓడించాలనే ఉద్దేశంతో.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.పట్టణ ప్రజల తాగునీటి కోసం 10 కోట్ల 52 లక్షలు, వార్డు అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టణంలో 35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని గంగుల కమలాకర్ తెలిపారు. కాగా ఈనెల 14 న ఈటల రాజేందర్ బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Future ant for yards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page