ఈ నెల 21లోపు అభ్యంతరాలను తెలియజేయండి

0 13

-వన్ స్టాప్ సెంటర్ (సఖి) ఉద్యోగ నియమకాలపై మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ పిడీ పద్మజ

కడప ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లా వన్ స్టాప్ సెంటర్ (సఖి) కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ. పద్మజ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని వన్ స్టాప్ సెంటర్ (సఖి) కేంద్రంలో కేస్ వర్కర్, పారా మెడికల్ పర్సన్, సెక్యూరిటీ/నైట్ గార్డ్ పోస్టుల నియామకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించి.. రిమార్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఆ జాబితాను జిల్లా మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ కార్యాలయంలోను అలాగే జిల్లా వెబ్ సైట్  http://kadapa.nic.in/ నందు పొందుపరచడం జరిగిందన్నారు.ఆయా పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు తమ రిమార్కులను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మూడు రోజుల్లోగా అంటే 21 తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని ఆమె ఆ ప్రకటనలో తెలియజేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: File objections by the 21st of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page