కరట్ట  విస్తరణకు నిధుల కొరత

0 12

గుంటూరు ముచ్చట్లు:
రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసే కరకట్ట విస్తరణ పనులు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఎంఆర్‌డిఏ) సమావేశంలో కరకట్టను విస్తరించాలని నిర్ణయించారు. వెనువెంటనే శంకుస్థాపనకు తేదీ నిర్ణయించారు. అనంతరం కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. దీనిపై సిఆర్‌డిఏ అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న కరకట్టను ప్రకాశం బ్యారేజీ నుండి వెంకటపాలెం వరకూ ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అనుసంధానం చేసే వరకూ నాలుగు లైన్లుగా విస్తరించాలని అనుకున్నా.. స్థానిక రైతుల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. దీంతో పని కొంత ఆపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.జాతీయ రహదారి విస్తరణ జరిగితే వెంకటపాలెం వద్ద కృష్ణానదిపై వంతెన వస్తుందని, కరకట్టను నాలుగులైన్లు చేయాల్సిన అవసరం లేదని అధికార పార్టీకి చెందిన పలువురు రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పూలింగు సమయంలో ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలకు చెందిన రైతులను అప్పటి టిడిపి నాయకులు తీవ్ర ఇబ్బందుల పాల్జేశారని, అటువంటప్పుడు అక్కడి రైతుల కోసం తాము భూములు ఎందుకు ఇవ్వాలని రెండు గ్రామాల రైతులు అడ్డం తిరిగినట్లు తెలిసింది.కరకట్టను విస్తరించాలంటే రైతులకు చెందిన పట్టా భూమిని కొంత తీసుకోవాల్సి ఉంది.

 

 

ప్రస్తుతం అక్కడ పట్టాభూమి ఎకరం విలువ నాలుగు కోట్ల వరకూ ఉంది. నాలుగులైన్లుగా విస్తరిస్తే కరకట్ట నుండి పొలాల్లోకి మార్గం ఉండదు. దీంతో భూముల విలువ తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. అయితే ఒకరిద్దరు రైతులు కరకట్ట విస్తరణకు సిద్ధమని చెప్పినప్పటికీ ఎక్కువమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. రోడ్డును నిర్మించే సమయంలో అక్కడ భూముల సహజస్థితి దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. దీనిపైనే రైతులూ అభ్యంతరాలు చెబుతుండటంతో విస్తరణపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత రానుంది.కరకట్టను నాలుగులైన్లుగా విస్తరించేందుకు అవసరమైన నిధులు ఎఎంఆర్‌డిఏ వద్ద లేవు. కిలోమీటరుకు కనీసం రూ.22 కోట్ల వరకూ ఖర్చవ్వొచ్చని గతంలో అంచనా వేశారు. ఈ లెక్కన ఐదు కిలోమీటర్లకు రూ.100 కోట్లకుపైనే అవుతుంది. గ్రీనరీ, ఇతర సదుపాయాలకు మరో రూ.20 కోట్లకుపైనే ఖర్చవుతుందని ఇవన్నీటినీ దృష్టిలో పెట్టుకుని ఎఎంఆర్‌డిఏ అధికారులు కొంత వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటికే కౌలు చెల్లించలేదని, దానికి కోసం కనీసం రూ.196 కోట్లు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగా కౌలు చెల్లింపులు జరిపిన తరువాత ప్రభత్వుం నుండి వచ్చే నిధుల ఆధారంగా పనులు ప్రారంభించాల్సి ఉందని చెబుతున్నారు. కరకట్ట దిగున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంది. కరకట్టను నాలుగు లైన్లుగా విస్తరించడ మంటే చంద్రబాబు ఇంటికి రాచమార్గం వేసినట్లేనని, ఆ ఇంటిని తొలగించే దాకా విస్తరణ చేయొద్దని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృషా ్ణరెడ్డి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీంతోపాటు కృష్ణానది అంచున ఉన్న భవనాలపై కోర్టుల్లో కేసులున్నాయి. ఇప్పుడు రోడ్డును విస్తరించడం ద్వారా నిర్మాణాలకు అనుమతిచ్చినట్లే అవుతుందని అధికార పార్టీలోనే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం కూడా విస్తరణ నిలిచిపోవడానికి మరొక కారణంగా ఉంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Lack of funding for Karta expansion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page