కరోన పట్ల అప్రమత్తంగా ఉండండి

0 43

రామసముద్రం ముచ్చట్లు:

 

 

కరోన పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కెసిపల్లి ఏఎన్ఏం సుగుణమ్మ అన్నారు. బుధవారం సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ పరిధిలోని వై.కురప్పల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోన మహమ్మారి కోరలు చాపి విలయతాండవం చేస్తోందన్నారు. థర్డ్ వేవ్ లో భాగంగా బ్లాక్ పంగస్ కూడా మన జిల్లాలోకి వచ్చిందన్నారు. గతంలో పాజిటివ్ వచ్చిన వారు, చిన్న పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ గౌతమి, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, ఆశ వర్కర్లు రాధమ్మ, మంజుల, వాలింటర్ మేఘన తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Be vigilant towards the corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page