కర్నూలు జిల్లాలో జంట హత్యలు

0 6

కర్నూలు ముచ్చట్లు :

 

 

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసర వాయి గ్రామంలో జంట హత్యలు జరిగాయి. పెసర వాయి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు వడ్డు ప్రతాపరెడ్డి, వొడ్డు నాగేశ్వర్రెడ్డిలను గురువారం ఉదయం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వారి తమ్ముడు వోడ్డు మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దిన కార్యక్రమాలకు స్మశనవాటికకు వెళుతున్న సమయంలో వాహనంలో వచ్చిన ప్రత్యర్థులు రెప్ప పాటు క్షణంలో అన్నదమ్ముల పై వేట కొడవళ్ళతో దాడి చేసి చంపారు. వీరి వెంట ఉన్న ముగ్గురు బంధువులపై కూడా దాడికి తెగపడ్డరు. గాయపడిన వారిలో ఓడ్డు వెంకటేశ్వర్ రెడ్డి, మరొకరు ఉన్నారు. గాయాలయిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Twin murders in Kurnool district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page