కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సెస్ ని రెగ్యులర్ చేయాలి . కోవిడ్ విధుల్లో మరణించిన వారికి న్యాయం చేయాలి

0 9

కాకినాడ ముచ్చట్లు:

కాంట్రాక్టు స్టాఫ్ నర్సేస్ (నర్సింగ్ ఆఫీసర్లు) కోవిడ్ విధులలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగులకు 50 లక్షల బీమా కల్పించాలని, రెగ్యులర్ చేయాలని, అందరికి 34 వేలు వేతనం, 35 క్యాజువల్ లీవులు అమలు చేయాలని, కోవిడ్ సోకిన వారికి 21 లీవులు అమలు, కోవిడ్ విధులలో వారియర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని, వివిధ విభాగలలోని వారికి వేతన బకాయిల చెల్లింపు తదితర సమస్యల పరిస్కారం కోరుతూ  3 వ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ GGH వద్ద కూడా నిరసనలను తెలిపారు. ఈ నెల కాలంలో మరణించిన 16 మంది కాంట్రాక్టు నర్సులు, మరియు ఇతర 60 మంది రెగ్యులర్, కాంట్రాక్టఉద్యోగులకు నివాళులు తెలిపారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.సమస్యలు పరిష్కరించక పోతే జూన్ 28 న సమ్మె నిర్వహిస్తామని నినదించారు. కార్యక్రమం లో కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి భవాని,కే.ఫిలిప్, అనురాధ ,వెంకటలక్ష్మి, దుర్గమ్మ , ఎస్ ‌బేబీ, రమాదేవి, అమ్మాజీ, కన్నమ్మ ,మాధవి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Contract outsourcing staff nurses should be regularized
. Justice must be done to those who died in Kovid duties

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page