కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

0 1

జగిత్యాల ముచ్చట్లు:

పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ సేవలంధించిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల పట్టణానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అల్లాడి వెంకట్(బుక్క వెంకన్న)  అకస్మాత్తుగా కొన్ని రోజుల క్రితం మరణించగా ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన  శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి  ఆదేశంతో కార్యకర్తలందరు   లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి అందించారు.గురువారం స్థానిక ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి వెంకటి కుటుంసభ్యులకు నగదును కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్బంగా  జీవన్ రెడ్డి మాట్లాడుతూ  వెంకటి కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషిచేశారని, అలాగే నాకు గెలుపుకు వ్యక్తిగతంగా దొహధపడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్  విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ  మున్సిపల్  ఫ్లోర్ లీడర్  కళ్ళెపెల్లి దుర్గయ్య,కౌన్సిలర్ నక్క జీవన్ కుమార్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కమటాల శ్రీనివాస్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు,రఘువీర్ గౌడ్ ,తోట నరేష్ , నేహాల్, మున్ను, బీరం రాజేష్ ,ప్రకాష్, గంగాధర్,సలీం,రాజేష్  తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:The Congress party has always been supportive of the activists
Graduate MLC Jeevan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page