గ్రామాలతోపాటు చెరువుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 24

– పైలెట్‌ ప్రాజెక్టుద్వారా చెరువుల మరమ్మత్తులు
– ప్రజాప్రతినిథులు బాధ్యత గా వ్యవహరించాలి
-పురోగతిపై మార్పులేకుంటే కఠిన చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

నియోజకవర్గంలో గ్రామాల అభివృద్దితోపాటు చెరువుల సమగ్రాభివృధ్దిపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకొన్నారని, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం మంత్రి సూచనలమేరకు ఉప్య్యాధిహామీ రాష్ట్ర కౌన్సిల్‌మెంబరు విశ్వనాథం తో కలిసి అధికారులు, ప్రజాప్రతినిథులతో సమావేశం జరిగింది.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి గ్రామాలతో పాటు, అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే రైతుల శ్రేయస్సుతోపాటు భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ఉపాధి హామీ ద్వారా అనేక పనులు చేపడుతోందని తెలిపారు. ఆదర్శంగా పుంగనూరు నియోజకవర్గంలో చెరువులను గుర్తించి సమగ్రాభివృద్ది చేసి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్రాంత డిఈఈ చంద్రశేఖర్‌ రెడ్డి సూచనలమేరకు చెరువుల అభివృద్దిపై పవర్‌ ప్రొజెక్షన్‌ ద్వారా ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో అభివృధ్ది పనుల్లో ప్రజలోపాటు ప్రజాప్రతినిథులు భాగస్వాములు కావాలని కొరారు. అభివృద్ది పనుల్లో వెనుకంజలో ఉన్నారని , స్రమిష్టి కృషితో పురోగతి సాధించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.జగనన్న పచ్చతోరణం ద్వారా విరిగా మొ క్కలు పెంచాలని వీటి సంరక్షణ భాద్యత సర్పంచులదే నన్నారు.ఈ సమావేశంలో డ్వామా ఏపిడీలు రామాంజనేయులు, శ్రీనివాసులు, ఎంపీడీఓ వెంకటరత్నం, జెడ్పిటీసీ సభ్యుడు దామోదర రాజు, మాజీ ఎంపీపీ అంజిబాబు సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Special measures for development of ponds along with villages-YSSRCP Secretary of State Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page