చిత్తూరు జిల్లాలో ఉపాధిహామి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి -ముత్తంశెట్టి విశ్వనాథ్‌

0 36

పుంగనూరు ముచ్చట్లు:

 

గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన పనులను ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టి, అభివృద్ధి చేసేందుకు చిత్తూరు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు ఉప్యాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ తెలిపారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో జెడ్పి మాజీ వైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి ఆయన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపాధి పథకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్చసంకల్పం క్రింద గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, మొ క్కలు నాటడం, కుంటలు, చెరువుల్లో రెండు మీటర్ల లోతు నుంచి పూడికతీసి , కట్టలను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఖాళీగా ఉన్న అన్ని స్థలాల్లోను వెహోక్కలు నాటడం జరుగుతుందన్నారు. వీటితో పాటు రైతులకు అవసరమైన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాలలో ప్రణాళిక బద్దంగా పనులను నిర్వహించి, పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నిలపాలని కోరారు. పని అడిగిన ప్రతి కూలీకి పనులు కల్పిస్తామని, లాక్‌డౌన్‌లో ఉపాధిహామి పథకం ద్వారా వేలాది మంది కూలీలకు జీవనోపాధి కల్పించిందని తెలిపారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో గ్రామీణ సమాగ్రాభివృద్ధి చేపడుతామని తెలిపారు. మన ఊరు – మనచెరువు నినాదంతో గ్రామాలోల నూతన ఒరవడి చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపిడి చందన, ఏపీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Rural Development through Employment Scheme in Chittoor District – Muthamsetti Vishwanath

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page