చెత్త సేకరణ పన్ను రద్దు చేయాలి

0 9

-దర్శి లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

దర్శి ముచ్చట్లు:

- Advertisement -

ప్రకాశం జిల్లా దరిశి నగర పంచాయతి పరిధిలో చెత్త పై యూజర్ చార్జీల ప్రతిపాదనలను విరిమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తీ,డ్రైనేజీ, పన్నుల పెంపుదలకు ఇచ్చిన జి వో 196,197,198 జి.ఓ లను రద్దు చేయాలని పౌర సమాఖ్య  దరిశి పట్టణ కమిటీ అధ్వర్యంలో నగర పంచాయితీ ఆఫీసు వద్ద ఆందోళన చేసి కమిషనర్ ఆవల సుధాకర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
సిపియం నాయకులు తాండవ రంగారావు , మాట్లాడుతూ  కేంద్ర బిజెపి షరతులకు రాష్ట్ర వైసిపి ప్రభుత్వం లొంగి నగర ప్రజలపై పన్నుల భారాలు వేయడం అన్యాయం అని   దరిశి నగర పంచాయితీ పరిదిలో ఉన్న ప్రతి ఇంటికి  సంవత్సరానికి 720 రూపాయలు చెత్త పన్ను వేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని  ప్రభుత్వం ఇప్పటికే ఇంటి పన్నులను భారీగా పెంచిందని తెలిపారు. నగరాలు, మున్సిపాలిటీ లు ,నగర పంచాయతి లలో ప్రజలకు చేసే ప్రతి సేవకు పన్నులు వసూలు చేసి ,ఆ డబ్బులతోనే అభివృద్ధి పనులు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్ణ యించిందని దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని,అందులోనే చెత్త పన్ను పై యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారని, దాని కోసమే గత అసెంబ్లీ సమావేశాలలో చట్టాలను చేశారని తెలిపారు.

 

 

రైతు సంఘం కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  కరోనా తో పూట గడవడమే కష్టం గా ఉంటే , ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు భారాలు వేయడాన్ని వ్యతిరేకించాలని ,చెత్త పన్ను కట్టకుండా వ్యతిరేకంగా పోరాడాలని మేం ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.ప్రజా సంఘాల అధ్వర్యంలో పట్టణాలు, నగర పంచాయతి లలో ప్రజలపై పన్నుల భారాలపై రద్దు చేసే వరకు పోరాడాతామని ,ప్రజలు పాల్గొనాలని కోరారు.ఈ నిరసన ధర్నాలో డి వై ఎఫ్ ఐ,,సి ఐ టి యు మహిళా,సి పి ఎం నాయకులు సిద్ది కోటిరెడ్డి, అంజిబాబు, లక్ష్మి ,రంగమ్మ, పద్మావతి , గోగు వెంకయ్య , ఈమని నాగేశ్వరరావు , ఉప్పు నారాయణ ,గర్నిపూడి జాన్ ,కోటిరెడ్డి, సాయి కృష్ణ , రవితేజ , సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Garbage collection tax should be abolished

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page