జంట హత్యలతో భగ్గుమన్న ఫ్యాక్షన్

0 12

కర్నూలు  ముచ్చట్లు:

- Advertisement -

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది.  గడివేముల  మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకుల జంట హత్యలు  రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం ఉదయం పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వొడ్డు ప్రతాప రెడ్డి, వొడ్డు నాగేశ్వర రెడ్డి శ్మశాన వాటికకు వెళ్తుండగా వాహనంలో వచ్చిన దుండగులు క్షణాల్లో వేటకొడవళ్లతో వచ్చి దారుణంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితం వొడ్డు ప్రతాప్ రెడ్డి తమ్ముడు వొడ్డు మోహన్ రెడ్డి చనిపోయాడు. దిన కార్యక్రమాలకు వెళ్తున్న అన్నదమ్ములపై దాడి చేసి హత్య చేశారు. దాడిలో మరో ముగ్గురికి గాయాలైనట్లు  సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Faction that collapsed with twin murders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page