జూమ్ వదిలి ఏ పీ కి రా బాబూ ! -వై ఎస్ ఆర్ సీ పీ నేత ఎన్. రాజా రెడ్డి

0 25

-రెండేళ్లు గా విమర్శ లకే పరిమిత మైన చంద్రబాబు

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

ఏ పీ కి వస్తే ఇక్కడి పరిస్తితి తెలుస్తుంది వై ఎస్ ఆర్ సీ పీ నేత ఎన్. రాజా రెడ్డి విమర్శ జూమ్ వదిలి ఏ పీ కి చంద్రబాబు రావాలని, ఏ పీ కి వస్తే ఇక్కడి పరిస్తితి తెలుస్తుందని వై ఎస్ ఆర్ సీ పీ నేత ఎన్. రాజారెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధికారం లోనకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకొందని, 15 నెలలుగా కరోనాతో పోరాటం చేస్తున్నామని, చంద్రబాబు నాయుడు ఏ పీ ని వదిలేసి హైదరాబాద్ లో దాక్కొని అక్కడ నుండి ప్రజలకు, తమ పార్టీ కార్యకర్తలకు కనపడకుండా జూమ్ మీటింగ్ లు ద్వారా ప్రెస్ మీటింగ్ లు పెడుతూ ప్రతినిత్యం ప్రజలల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిం చడం విడూరమని అన్నారు. ప్రభుత్వం వైద్యం విద్యకు పెద్ద పీట వేస్తు న్నదని, సంక్షేమ పథకాల అమలుకు కేలండర్ ప్రకటించి అనుకొన్న సమయానికీ అనుకొన్న విదంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా కరోన నిర్దారణ పరీ క్షలు, వాక్సిన్ ప్రక్రియ ఒక ఏ పీ లోనే జరుగుతున్నాయని, కరోనకు ఏ రాష్ట్రం లో లేనట్లు ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యము అందించడం జరుగుతున్నదని, కరోనాతో తల్లి దండ్రులు చనిపోయి అనాదులైన పిల్లలకు 10లక్షల రూపాయలు వారి పేరుమీద దీపాజిట్ చేసి వారిని చదివించే భాద్యత తీసుకొన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి గా ఉన్నపుడు ఒక్క మెడికల్ కళాశాల గాని రాష్ట్రం లో నెలకొల్ప లేదని జగన్ మోహన్ రెడ్డి ఏకంగా 11 మెడికల్ కళాశాల ను ఒకేసారి ప్రభుత్వ తరపున నెలకొల్పడం రికార్డని అన్నారు. కరోన సమయంలో చంద్రబాబు మరియు వారి పార్టీ నాయకులు ఇల్లకే పరిమితం అయ్యారని వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు మరియు ప్రభుత్వ పెద్దలు కరోన సమయంలో కూడ బయపడకుండా ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగిందని, కరోన తగ్గుముకం పడుతున్నా తరుణంలో వారి మనుగడ కోసం నిరశనలు, ధర్నాలు నిర్వహించడం హాస్యాస్పద మని విమర్శించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Leave the zoom to A P Ki Ra Babu! -YSRCP leader N. Raja Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page