టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం

0 9

– ఇష్టారాజ్యంగా ఆక్రమణలు.
ప్రమాదాలకు నిలయాలు- ఆక్రమణలే
నెల్లూరు   ముచ్చట్లు:
టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో పాలనే నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా దొరికిన కాడికి దోచెయ్ అన్న విధంగా రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలను చిన్న చిన్న వ్యాపారాలు పేరిట ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ ఎస్పీ బంగ్లా నుండి కొత్తూరు వరకు ఇరువైపుల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు ఇప్పటికే గురైనవి. ఇది ఇలా ఉండగా రోడ్డు విస్తరణలో భాగంగా నగరపాలక శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఉన్న వందల సంవత్సరాల నాటి మహా వృక్షాలు సైతం తొలగించిన విషయం విధితమే. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు వారివారి పరపతిని ఉపయోగించి ఆయా ప్రాంతాలలో ఆక్రమణకు తెరలేపారు. ముఖ్యంగా పొదలకూరు రోడ్డు పద్మావతి సెంటర్ ప్రాంతంలో ఏకంగా ప్లాస్టిక్ పట్టాలతో హద్దులు ఏర్పరచుకొని వ్యాపారాలు చేస్తున్న సందర్భాలు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆనుకొని నిన్న మొన్నటి వరకు చెత్త పోసుకునే స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదేవిధంగా పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న జడ్పీ హైస్కూల్ కి ఎదురుగా కూడా  పూర్తిస్థాయిలో ఆక్రమణలో జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా అదే ప్రాంతంలో నగరపాలక శాఖ స్థలములో డంపింగ్ యార్డ్ను తలపిస్తూ గుట్టలుగుట్టలుగా వ్యర్ధాలను స్టాక్ చేసి ఉన్నారు. స్థానిక రామకోటి నగర్ ప్రాంతంలో ఉన్న కరెంట్ ఆఫీస్ ఆనుకొని వందలకొలది వ్యాపారాలు వెలసి ఉన్నాయి. ఇదే స్థలాన్ని గతంలో ఆక్రమణకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో నగరపాలక శాఖవారు మొక్కలను నాటారు. అవి కాస్త పెరిగి పెద్దవైన ఆ సమయంలో ఆ చెట్లను సైతం తొలుత తెగనరికి, అదే ప్రాంతంలో రాత్రికి రాత్రే బ్యాంకులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్న సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకనూ ఇంకొంతమంది షెడ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విధంగా పాలక శాఖకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురవుతున్న ప్రాంతాలలో వాహనాల రద్దీ కారణంగా అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షణ నిర్వహించి ఆక్రమణ స్థలాల పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని  అభిప్రాయాలు వినిపిస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Oversight error by town planning authorities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page