పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగడం లేదు  మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్

0 6

జగిత్యాల ముచ్చట్లు:
పట్టణంలో పారిశుద్ధ్యం తోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయా ఆవరణలో 58 మంది మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులను చైర్ పర్సన్ శ్రావణి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ 2020-21 సంవత్సరానికి సంబంధించిన నిత్యావసరాలను అందిస్తున్నమన్నారు. జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటివరకు శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నమన్నారు. దీనిలో భాగంగా తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ, ట్రై బిన్స్ ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, స్వీపింగ్ మిషన్, చెత్త తరలింపునకు ఆటోలు, ట్రాక్టర్స్, జేసిబిలను కొనుగోలు చేశామన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమం ఆగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. పారిశుద్యం, మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గత పాలనతో పోల్చి చుస్తే పారిశుధ్యం ఏ విధంగా మెరుగైందో ప్రజలు గమనించాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పారిశుధ్య కార్మికులు ధైర్యంగా పని చేశారాని, వారికి చైర్ పర్సన్ శ్రావణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు…

 

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Special efforts for the creation of sanitation and infrastructure
Corona does not stop welfare and development even in difficult times
Municipal Chairperson Boga Sravani Praveen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page