పుంగనూరులో క్లీన్‌ ఆంధప్రదేశ్‌ను పటిష్టంగా అమలుజరుపుదాం-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 20

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్లీన్‌ ఆంధప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని మున్సిపాలిటిలో పటిష్టంగా అమలుజరుపుతామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ స్పష్టం చేశారు. గురువారం మున్సిపాలిటిలో మహిళా సంఘాల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ తిరుపతిలో గత నాలుగు సంవత్సరాల నుంచి సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌ క్రింద యూజర్‌ చార్జీలు వసూలు చేయడం జరుగుతోందన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కార్మికులు ప్రజల ఇంటి నుంచి హానికార చెత్తను తొలగించి, దానిని శాయపద్దతిలో నశింపచేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి కార్మికులు సేకరిస్తారని , వారి కోసం రోజుకు రూ.2 లు ఖర్చు చేయడం ఇబ్బందికరం కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసం కార్మికులకు ఇచ్చే రెండురూపాయలతో ఎవరు నష్టపోరని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో బ్యాధ్యత పెరిగి, చెత్తను జాగ్రత్తగా కార్మికులకు అందిస్తారని తెలిపారు. కేవలం కొంత మంది కుట్రపూరిత ంగా చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. తడిచెత్త, పొడిచెత్త , హానికార చెత్తను ఇండ్ల నుంచి తీసుకెళ్లడంతో ప్రజలు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. తడిచెత్తద్వారా ఎరువును తయారయ చేసి, విక్రయించడం జరుగుతోందన్నారు. పొడిచెత్తను రీసైక్లీన్‌ చేపట్టడం జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో మహిళా సంఘాల సభ్యులు ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించి, క్లీన్‌ ఆంధప్రదేశ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా పుంగనూరు ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, ఐకెపి కోఆర్డినేటర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Let’s strictly enforce clean Andhra Pradesh in Punganur – Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page