భక్తులకు రాఘవుడి దర్శనం

0 8

-చాలా రోజుల తర్వాత తెరుచుకోనున్న మఠం తలుపులు మళ్లీ పూర్వవైభవం వ్యాపారుల కళ్ళలో ఆనందం

మంత్రాలయం ముచ్చట్లు:

- Advertisement -

మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి బృంధావనం చాలా రోజుల తర్వాత మళ్ళీ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ మఠం అధికారులు పత్రికా ప్రకటన జారీ చేశారు. ఆరోగ్య శాఖ వారి సూచనల కనుగుణముగా  శ్రీ మఠం పీఠాధిపతుల ఆదేశాల మేరకు  శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనమునకు తేదీ.22-6-2021నుండి భక్తులకు ధర్శన భాగ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.భక్తులందరూ కోవిడ్ నిబంధనలను అనుసరించి,మాస్క్ ధరించి భౌతిక దూరమును పాటించాలని సూచించారు.స్వయముగా మంత్రాలయ క్షేత్రమునకు రాలేని భక్తులు శ్రీ మఠం వెబ్సైట్  లింక్ ద్వారా ఆన్లైన్ నందు దర్శనము సేవలయందు పాల్గొనవచ్చును.దర్శనము సమయము:-ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 9 రాత్రి వరకు ధర్శనం చేసుకోవచ్చు అని తెలిపారు. శ్రీ మఠం తలపులు తెరుస్తున్నారని అధికారులు ప్రకటించిన వెంటనే మంత్రాలయంలోని వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం తొంగి చూసింది. చాలా రోజుల నుంచి వ్యాపారం లేక అల్లాడిపోతున్న వ్యాపారస్తులు ఈ వార్త విన్నవెంటనే ఆనందం వ్యక్తం చేశారు.మఠం తలుపులు  తెరుసుకుంటే భక్తులు అధిక సంఖ్యలో మంత్రాలయంకు వస్తారని దీంతో వ్యాపారాలు కూడా జరుగుతాయని ఆశిస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Raghav’s vision for the devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page