మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

0 16

సిద్దిపేట ముచ్చట్లు:

హుస్నాబాద్ కు చెందిన వెల్దండి లక్ష్మీపతి తన 60వ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా మునిసిపల్ కార్మికుల సమక్షంలో జరుపుకున్నారు. 110 మంది హుస్నాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కూలు, శానిటైజర్ లు పంపిణీ చేశారు. ఉదయాన్నే లేచి పట్టణాన్ని పరిశుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల సేవ చాలా గొప్పదని అందుకే వారిని గౌరవిస్తూ తన 60వ పుట్టినరోజు వారి మధ్యలో చేసుకోవడం జరిగిందని వెల్దండి లక్ష్మీపతి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత మాట్లాడుతూ జన్మదినం వివాహ వార్షికోత్సవాలు తదితర వేడుకలకు ఎంతో మొత్తంలో డబ్బు వెచ్చించి జరుపుకుంటున్న సందర్భాల్లో ఇలా కరోనా మహమ్మారి కట్టడిలో ముందు వరుసలో ఉన్న హుస్నాబాద్ మున్సిపల్ కార్మికులకు శానిటైజర్ లు, మాస్కూలు మరియు నిరుపేద కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయడం ఆదర్శనీయం అని కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులను గౌరవించడం వారి మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యక్తిగత దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు, శనిటిటైజర్లను ఉపయోగించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు  సత్యనారాయణ, దూడం నాగభూషణం, చింతకింది శ్రీనివాస్, వొడ్డేపల్లి బాలయ్య, సబ్బని శ్రీదేవి, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Distribution of masks and sanitizers to municipal sanitation workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page