మైనింగ్ మాపియాల కోసమే మావోల భూటకపు ఎన్కౌంటర్          సిపిఐ (యం.ఎల్) నేత మల్లే పల్లి ప్రభకర్

0 8

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పోస్కో , వెదంత, జిందల్ , అదాని, అంబాని,  లాంటి అక్రమ మైనింగ్ కార్పొరేట్ కంపెనీల  కోసం దండ కరణ్యం బస్తర్ లను తమ అదినంలో కి తీసుకోవడం కోసం అడవికి, అదివాసిలకు  అండగా ఉన్న  మావోయిస్టు పార్టిని అంతం చేయడం కోసం , కేంద్ర, రాష్ట్రల సంయిక్త పోలీస్ అపరేషన్ లో  భాగంగానే విశాఖపట్నంలో జరిగిన బుటకపు ఎన్ కౌంటర్ అని, సిపిఐ (యం.ఎల్) పార్టి  కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లే పల్లి ప్రభకర్ తీవ్రంగ మండిపడ్డారు. విశాఖ మన్యంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, నిది నిక్షేపాలు బంగారు గనులకోసం అనేక మైనింగ్ కంపెనీలు  అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. విటికి వ్యతిరేకంగా విప్లవ సంస్థల ఆద్వర్యంలో అక్రమ మైనింగ్ లకు వ్యతిరేకంగా , అడివి సంపద దోపిడికి  వ్యతిరేకంగా అనేక సంత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

వీటిని జిర్జించుకోలేని దళారి పాలక  వర్గాలు జగన్ మోహన్ రెడ్డి, కె.సి.ఆర్ , కేంద్ర లోని మోడి సర్కార్ లు కార్పొరేట్ సంస్థలతో  కలసి  ప్రజల పక్షనా పోరాడుతున్న  సంస్థలపై అక్రమ కేసులు, జైళ్ళు, నిర్భందాలు,  బుటకపు ఎన్ కౌంటర్ లకు పాల్పడుతున్నారని విమర్శించారు.. అడివి లోకి ఇతరులు వేల్లకుడదని నిషిద్దం చట్టం చెబుతుంది. మరి కేంద్రసాయుద పోలీస్  బలగాలు, గ్రేహౌండ్స్ పోలీస్ ,  అపరేషన్ సమాదాన్, ది, బ్రిగేడ్  హెడ్ క్వటర్  పోలీసీస్ ట్రేనింగ్ స్కూల్, యాంటి నక్సల్స్  స్కాడ్ , పెర్షతో అమాయక అదివాసి ప్రజల మద్య, అత్యంత అదునిక అయుదలతో  హెలికాప్ట్ ర్స్ , డ్రోన్ ల కేమరలతో , డ్రోన్ బాంబులతో పోలీస్  పోర్స్  అడివిలో ఎందుకుందని, ఇది ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రబాకర్ ప్రశ్నించారు. ఇటివల బస్తర్ ప్రాంతంలో మా అడివి, మా సంబద, మా సంస్కృతి , మా హక్కులు అంటూ అక్రమంగా ఏర్పటు  చేసిన పోలీస్ క్యాంపులను ఎత్తి వేయ్యాలని నెలల తరబడి అదివాసిలు శాంతియుతంగా  ధర్నలు చేస్తే 6 మంది అదివాసిలను కాల్చిచంపారు. ఇందులో ఒక మహిళ  నిండు గర్భవతి కూడా చనిపోయింది. జగన్ మోహన్ రెడ్జి, కె.సి.ఆర్ . మోడి ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వెంటనే  నిలిపి  వేయ్యాలని, విశాఖ మన్యంతో పాటు  దండకారణ్యంలో ఉన్న పోలీస్ క్యాంపులను ఎత్తివేసి పోలీస్ కుంబింగ్  నిలిపివేయాలని డిమాండ్ చేసారు. అదివాసి ప్రాంతాలలో అక్రమ మైనింగ్ వెంటనే  నిలిపివేయ్యాలని, అదివాసి చట్టాలను కఠినంగా  అమలు చేయ్యాలని, విశాఖ పట్నం బుటకపు ఏన్ కౌంటర్ లపై సిట్టింగ్ జడ్జ్  తో విచారణ  జరిపించాలని, విప్లవ సంస్థలపై నయకులపై  పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయ్యాలని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్ ను ప్రభుత్వాలు నేరవేర్చాలని  లేని పక్షంలో  అన్ని  విప్లవ సంస్థలతో  కలసి దేశవ్యప్తంగా  రెండు తెలుగు రాష్ట్రాలలో దళారి పాలకులైన కె.సి.ఆర్  జగన్ సర్కార్ లకు  వ్యతిరేకంగా బల మైన ప్రజాస్వామ్య  ఉద్యమం  నిర్వహిస్తామని ప్రబాకర్ హెచ్చరించారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Mao’s global encounter is just for the mining mafia
CPI (ML) leader Malle Palli Prabhakar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page