మ‌రికాసేప‌ట్లో మట్టిలో క‌లిసిపోయేందుకు సిద్దం… లే.. క‌న్నాలే..! అని పిలువ‌గానే.. త‌ల్లి మాట విని లేచి కూర్చోన్న పిల్లాడు

0 63

చండీఘర్  ముచ్చట్లు:
మ‌రికాసేప‌ట్లో మట్టిలో క‌లిసిపోయేందుకు సిద్ధ‌మైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు. ఈ షాకింగ్ వార్త హ‌ర్యానాలో చోటుచేసుకున్న‌ది. లే.. క‌న్నా లే..! అని పిలువ‌గానే.. త‌ల్లి మాట వినిఒక్క‌ పిలుపుతో ఆ ఆరేండ్ల పిల్లాడు లేచి కూర్చోవ‌డంతో ఆ ఊరి వారంతా ఆ త‌ల్లి ప్రేమ‌ను క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.హ‌ర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతానికి చెందిన హితేష్‌, ఝాన్వి దంప‌తుల‌కు ఆరేండ్ల కుమారుడు ఉన్నాడు. టైఫాయిడ జ్వ‌రం ఎంత‌కూ త‌క్కువ కాక‌పోవ‌డంతో చికిత్స ఇప్పించేందుకు ఆ పిల్లాడ్ని ఢిల్లీలోని ఓ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే, మే 26 న వైద్యులు చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌టించడంతో చిన్నారి మృత‌దేహంతో సొంతూరుకు తిరిగొచ్చారు.

 

అంత్య‌క్రియ‌లు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాత్రంతా శ‌వం వ‌ద్ద జాగార‌ణ చేస్తూ త‌ల్లిదండ్రులు గ‌డిపారు. ఏడుస్తూ.. లేచి కూర్చో నాన్నా.. అంటూ త‌ల్లి అమాయ‌కంగా పిల్లాడ్ని మృత‌దేహాన్నిఅటూ ఇటూ క‌దిపింది. దాంతో పిల్లాడి శ‌రీరంలో క‌ద‌లిక క‌నిపించ‌డంతో ఒక్క‌సారి ఆశ్చ‌ర్య‌పోయిన తండ్రి వెంట‌నే తేరుకుని పిల్లాడి శ‌రీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు. సినిమాల్లో చూసిని సీన్ గుర్తుకొచ్చి పొరుగింటి యువ‌కుడు పిల్లాడి ఛాతీపై గ‌ట్టిగా ఒత్తడంతో ఒక్క‌సారి పిల్లాడి గుండె కొట్టుకోవ‌డం ప్రారంభ‌మైంది. దాంతో చికిత్స నిమిత్తం పిల్లాడ్ని హుటాహుటిన రోహ‌త‌క్ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పూర్తిగా కోలుకున్న బాలుడిని మంగ‌ళ‌వారం ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడ‌నుకున్న బాలుడు లేచి కూర్చోవ‌డంతో గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ అంతా అమ్మ ప్రేమ అంటూ మెచ్చుకున్నారు.అందుకే ఏవరైనా చని పొతే దింపుడు కళ్ళం వద్ద చివరి పిలుపు పిలువడం మన ఆనవాయితీగా వస్తుంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Ready to melt in the mud for a while …
Lay .. Kannale ..! As it is called .. the child who is sitting up after hearing the mother’s words

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page