రెండేళ్లలో ఎన్నో గొప్ప నిర్ణయాలు: డిప్యూటీ సీఎం ధర్మాన

0 3

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పరిధిలో పరశురామ పురం గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని (రీ సర్వే)ను డిప్యూటీ సీఎం,రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి  ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం  గ్రామస్తులతో అవగాహన సదస్సులో  ఆయన పాల్గొన్నారు  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రెండేళ్లలో ఎన్నో చరిత్రాత్మకమైన గొప్ప నిర్ణయాలు సీఎం జగనన్న సారథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. రీ సర్వే అలాంటిదే. మూడేళ్లలో రాష్ట్రంలో పూర్తి చేసి తీరుతాం. రికార్డుల స్వచ్చికరణ కచ్చితంగా చేపడతాం.  రూ.983 కోట్లు సర్వే కు కేటాయించాము. సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకున్నాము. రీ సర్వే పూర్తయితే దేశంలోనే  మన రాష్ట్రం గొప్ప ఆదర్శవంతంగా నిలబడుతుంది.  చిన్న చిన్న లోపాలు కూడా రాకుండా రెవెన్యూ, సర్వే శాఖల్లోని 4500 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసాము.  గత డిసెంబర్ 21న కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సీఎం చేతుల మీదుగా, రెవెన్యూ మంత్రిగా నేను ఈ పథకాన్ని ప్రారంభించడం జీవితంలో మర్చిపోలేని రోజు.  గొప్ప మానవత్వం ఉన్న, మంచి మనసున్న నాయకుడు జగన్. సామాన్యుడి అభ్యున్నతికి నిరంతరం ఆలోచించే నాయకుడు జగన్ ఒక్కరే.  రీ సర్వే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎవ్వరూ దీనిపై అపోహలు పడవొద్దు.   చిన్న లోపం కూడా లేకుండా అత్యంత పకడ్బందీగా రీ సర్వే పథకాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాటకర్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో శ్రీధర్, మున్సిపల్ ఛైర్పర్సన్ రాధా కుమారి, ఎమ్మెల్సీ వర్మ, డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆర్డీఓ కుమార్, సర్వే ఏడీ కే. ప్రభాకర్, ఏవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Many great decisions in two years: Deputy CM Dharmana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page