రేషన్ బియ్యం స్వాధీనం

0 4

నూజివీడు  ముచ్చట్లు:
రేషన్ బియ్యం అక్రమ రవాణాను  అధికారులు అడ్డుకున్నారు.  ఏలూరు  సోమవరప్పాడు, కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతాలకు సంబంధించిన సజ్జల చక్రధరరావు పై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా 25 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీల్లో 25 టన్నుల బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ను ప్రశ్నించారు.  విచారణలో ఏలూరు, నూజివీడు కు సంబంధించిన ఒకే వ్యక్తి   సజ్జల చక్రధరరావు ను  గుర్తించారు. సరుకు అంతా కృష్ణా జిల్లా నూజివీడు నుండి మండపేటకు కు వెళ్తున్నట్లు గుర్తించారు. గురువారం  తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో రంగంలోకి విజిలెన్స్ అధికారులు, డీటీ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుడు చక్రధరరావు వ్యాపారం ప్రతి రోజు మూడు లారీలు అక్రమ రవాణ నడుపుతున్నట్లు అధికారులు అంటున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Seized ration rice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page