రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

0 9

సంగారెడ్డి  ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం  పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ సంఘటనలో  ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఎదురుగా బైక్ ను  వేగంగా వస్తున్న ఓ స్కూటీ ఢీ కొట్టింది.  దీంతో  బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే  దుర్మరణం చెందగా , స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో  కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులోకి రాకపోవటంతో  గాయపడిన వారిని  ఆటో ట్రాలీలో ఆసుపత్రి తరలించటం గమనార్హం. సమాచారం అందుకున్న ఐడిఏ బొల్లారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికితరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకుని చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:One killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page