రోడ్డు ప్రమాదంలో మహిళ ఏఎస్ ఐ దుర్మరణం

0 30

పెద్దపల్లి ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద గురువారం లారీ స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో కమాన్ పూర్ ఏఎస్ఐ గా పనిచేస్తున్న కాసర్ల భాగ్య (54) అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దపల్లి లోని తమ నివాసం నుంచి కూతురు ఐశ్వర్య తో కలిసి బస్టాండ్ కు వెళుతుండగా స్కూటీ వెనుక సీటు పై కూర్చున్న భాగ్య వెనుక వైపు నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

- Advertisement -

వేగంగా ఢీకొనడంతో కిందపడిపోయిన భాగ్య శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె దేహం తునాతునకలయ్యింది. స్కూటీ నడుపుతున్నన్న కూతురు ఐశ్వర్య స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కాగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన భాగ్య లోగడ పెద్దపల్లి, జూలపల్లి, బసంత నగర్, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లలో పని చేశారు. ఘటనకు సంబంధించిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ ఐ రాజేష్ లు ఘటన స్థలానికి చేరుకొని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.అలాగే కమాన్ పూర్ ఎస్ ఐ శ్యాం పటేల్ పోలీసు సిబ్బంది పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. అందరితో కలివిడిగా ఉండే భాగ్య దుర్మరణం దురదృష్టకరమని శ్యాం పటేల్ పేర్కొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Woman ASI killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page