సారా బట్టి పై పోలీసులు దాడి. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ పది లీటర్ల సారా స్వాధీనం. పన్నెండు వందల లీటర్ల బెల్లపు ద్వంసం.

0 24

రాజమండ్రి  ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని గండేపల్లి గ్రామంలో పోలవరం కాలువ, పుష్కర కాలువ మధ్యలో రహస్యంగా పంటపొలలో  అక్రమగా సారా తయారు చేస్తున్నట్లు గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ కు  వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో బుధవారం ఉదయం ఆసరా బట్టి పై  దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ సారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని,1200 లీటర్ల బెల్ల ఊటను ధ్వంసం చేయడం జరిగిందని ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు. ఘటన లో కుడుపూడి వెంకటరావు, కాకి వెంకటరమణ, దుబ్బాకుల కామేశ్వరరావు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి పై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టులో హాజరు పరచడం జరిగిందని, వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా గ్రామాలలో అక్రమ సారా తయారీకి పాల్పడిన, సారా అమ్మకాలు జరుపుతున్న కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గండేపల్లి ఎస్సై శోభన్ కుమార్ హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Police attacked Sarah Batti. Three people were arrested
Seized ten liters of sara. Destruction of twelve hundred liters of gingerbread.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page