సింహాద్రిలో మంత్రి వెల్లంపల్లి

0 15

విశాఖపట్నం  ముచ్చట్లు:
సింహాద్రి అప్పన్నను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు గురువారం దర్శించుకున్నారు. అయనకు  ఆలయ మర్యాదలతో అధికారులు  ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యుల పేరిట గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిపిఆశీర్వచనం ఇచ్చారు.  మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా..అనేక సంక్షేమ ఫలాలను అందుకుంటూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఇక వెల్లంపల్లి చరిత్ర ఏమిటో ముందు తెలుసుకొని అశోక్ గజపతి రాజు మాట్లాడాలి. స్వామివారి గుడికి వచ్చి ఇటువంటి పచ్చి అబద్దాలు మాట్లాడటం..నా గురించి నీచమయిన రాజకీయాలు మాట్లాడటం అంత వయసు వచ్చిన ఆయనకు సరికాదు. దేముడికి మంచిచేసే విధంగా ఆయన ప్రవర్తించాలి. నిన్న ఇక్కడికి వచ్చి పంచగ్రామాల గురించి మాట్లాడుతున్నారు.. అసలు ఆయన పంచగ్రామాలకు అనుకూలమా..ప్రతికూలమా చెప్పాలి. ఏదైతే రాజుగారి అన్న కూతురికి పదవి వచ్చిందనే అక్కసుతో ఇటువంటి మాటలు ప్రభుత్వం పై మాట్లాడటం సరికాదని  మంత్రి అన్నారు.
భూములు లూటీ చేస్తున్నా మని అన్నారని తెలిసింది. ఎవరు మానసాస్ ట్రస్ట్ కి సంబంధించి భూములు..ఇతర ఆస్తులను ఎలా లూటీ చేశారో త్వరలోనే నిగ్గుతేలుస్తామని అన్నారు.ఆలయ అర్చకులు దగ్గరనుండి..పంచగ్రామాల ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ భూ సమస్యను త్వరగా పరిష్కరించమని…దేముడికి కూడా డబ్బు వస్తుందని. అందరూ ఒక మాటమీద ఉంటే..అశోక్ గజపతి రాజు డబుల్ స్టాండ్ మాట్లాడుతున్నారు. ఇంకా అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో దేవాదాయ శాఖ నుండి వాహన మిత్రకి డబ్బులు ఇస్తున్నారని, దేవాదాయ శాఖ నుండి ఒక్క రూపాయి తీసుకుంటే నిరూ పించమనండి ఆ సొమ్ము తీసుకునే..లేక ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇలా అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. అలాగని కాదు..మేము రాజులం..మేము రాజశాసనాలు చేస్తాం అంటే కుదరదని అన్నారు.
రాచరిక పాలనకు ఈ ప్రభుత్వం వ్యతిరేకం.  ప్రజా వ్యవస్థ వచ్చింది. ప్రజలకు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అలాకాదని మేము రాజులం అని అహంకారం చూపిస్తేమాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం నడవదని తెలియజేస్తున్నామని మంత్రి అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Minister Vellampally in Simhadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page