సీలేరు ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

0 10

రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం మరియు సీలేరులో ఉన్న జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్తుఉత్పత్తి  ప్రారంభం అయింది. వివరాల కోసం ఛీప్ ఇంజనీర్ రాంబాబు గారిని వివరణ కోరగా,పోలవరం కాపర్ డ్యామ్ పనులు జరుగుతున్నందున నీటి విడుదల నిలిపివేయాలని,,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీలేరు పరిధిలోని జలవిద్యుత్ కేంధ్రాలలో విద్యుత్ఉత్పత్తి నిలిపివేశామని,అలాగే మాచ్ ఖండ్,సీలేరు డొంకరాయి,మరియు పొల్లూరులో 845 మెగావాట్ల విద్యుత్తుఉత్పత్తి జరుగుతోందని,విద్యుత్ అనంతరం విడుదలైన నీరు పోలవరం మీదుగా గోదావరికి చేరుతుందని,అక్కడ కాపర్ డ్యామ్ పనులు కొరకు ముందు జాగ్రత్తగా నీటి విడుదల నిలిపివేశామని,మొదటి పదిరోజులలో పనులు జరుగుతాయని భావించాం,పనులలో జాప్యం వలన నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ రాలేదు,ఈలోగా వర్షాకాలం రావడం వలన జలాశయాలలో నీటి నిల్వలు చేరే అవకాశం ఉంటుందని తెలియజేయగా వారి సూచనల మేరకు 35 రోజుల తర్వాత విద్యుత్ఉత్పత్తి ప్రారంభించామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డి.ఇ.బాలకృష్ణ గారు,డి.ఇ.టి,మరియు యస్.ఇ.కూడా పాల్గొన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags:Commencement of power generation at the Sealer Plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page