సేవా దృక్పథం గొప్ప సంస్కారం-జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

0 13

-బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్

అనంతపురము ముచ్చట్లు:

- Advertisement -

సేవా దృక్పథం గొప్ప సంస్కారం అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా 350 పడకలకు నేరుగా ఆక్సిజన్ అందించగలిగేలా 500 ఎల్పీఎమ్ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్లాంటు ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్డిటి సంస్థ సేవా దృక్పథంతో వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ఏర్పాటు వల్ల కరోనా సోకిన వారికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆక్సిజన్ ను నిరంతరంగా అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.ఈ సందర్భంగా రూ.75 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం చేపట్టామని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఏ.సిరి, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Service Perspective Great Culture-District Collector Nagalakshmi Selvarajan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page