సైదాపూర్ లో పెద్దిరెడ్డి పర్యటన

0 7

కరీంనగర్  ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పర్యటించారు. ముందుగా స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధికి మందు లేదని ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని హాస్పిటల్ లో చెల్లించిన డబ్బులను తిరిగి బాధితులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస రెడ్డి, సర్పంచులు విజయ, రవీందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు ఇటీవల కరొనతో చనిపోయిన మాజీ సర్పంచ్ చింతకుంట్ల మల్లారెడ్డి కుటుంబానికి నగదు 25000 రూపాయలు అందజేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Peddireddy tour in Saidapur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page