హిజ్రాల పేరు చెప్పు కొని వేరే మగ హిజ్రాలు డబ్బులు వసూలు చేస్తున్నారు

0 24

కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హిజ్రాల  పేరు చెప్పుకొని వేరే మగ హిజ్రాలు మా పేరు చెప్పుకొని మాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ నా పేరు దీప్తి అండి నేను ట్రాంజెండర్ కామారెడ్డి జిల్లా కేంద్రం లో కొంత మంది పురుషులు చిన్న మల్లారెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి , శబ్ది పూర్ గ్రామాలకు చెందిన కొంత మంది మగవాళ్ళు మాకు లాగా ఆడ వేషాలు వేసుకుంటూ కొంతమందితో అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం జరుగుతుందని, అట్టి విషయంలో  మా పేరు పోవడమే కాకుండా మేము ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని,వారు దొంగతనాలు చేస్తే మా పేరు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారు మేము ఒక్కటి కాదని వారు చేసే అన్ని పనులకు మేము బాధ్యులం అవుతున్నాం, ఇట్టి విషయంలో పోలీస్ స్టేషన్ నుంచి మాకు ప్రతిరోజు కాల్స్ రావడం జరుగుతుంది, ఇట్టి విషయంలో ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు వారి పైన ఫిర్యాదు చేయడం జరిగిందని , పోలీసు వారు పట్టించుకోవడం లేదని దయచేసి పోలీసులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు. మాకు తల్లిదండ్రులు ఎవరు లేరండి, వారికి మాత్రం తల్లిదండ్రులు, పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిలి వ్యవసాయం చేసుకుంటూ మరియు ఆటో డ్రైవింగ్ కూడా చేసుకుంటూ బతుకుతున్నారు, కానీ వారు చేసే తప్పు పనులకు మా పేరు చెప్పడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, వాళ్లు మగవారు మాలాగా ఆడవేషాలు వేసి మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని  ఇట్టి విషయాన్ని పోలీసులు అర్థం చేసుకుని మాకు  న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో దీప్తి, సిరి,  రేష్మి రిషిత, సాయిపల్లవి, నిషా, మహి సానియా, కీర్తన, భవిత, నేహా బావని, పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Other male Hijras are collecting money by mentioning the name of Hijras

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page