20 శాతం తగ్గిన నూనెల ధరలు

0 61

ముంబై     ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. బుధవారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. అలాగే క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 1452 డాలర్ల నుంచి 1415 డాలర్లకు తగ్గించేసింది. అంతేకాకుండా ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1245 డాలర్ల నుంచి 1148 డాలర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనె ధరలు మరింత తగ్గొచ్చుమరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. వంట నూనె ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వంట నూనెల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.పామాయిల్ ధర కేజీకి మే 7న రూ.142గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రేటు ఇప్పుడు రూ.115కు తగ్గింది. అంటే 19 శాతం దిగొచ్చింది. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. మే 5న ధర కేజీకి రూ.188 వద్ద ఉండేది. ఇప్పుడు ఈ రేటు రూ.157 తగ్గింది. అంటే 16 శాతం క్షీణించింది.ఇంకా సోయా ఆయిల్ ధర మే 20న కేజీకి రూ.162 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆయిల్ ధర 15 శాతం క్షీణతతో కేజీకి రూ.138కు తగ్గింది. అలాగే ఆవాల నూనె ధర కూడా మే 16న రూ.175 వద్ద ఉండేది. ఇది ఇప్పుడు రూ.157 క్షీణించింది. అలాగే వేరు శనగ నూనె ధర రూ.190 నుంచి రూ.174కు దిగొచ్చింది. వనస్పతి ధర రూ.154 నుంచి రూ.141కు తగ్గింది. ఈ రేట్లు ముంబై మార్కెట్‌కు వర్తిస్తాయి.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags:Oil prices down 20 percent

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page