అధికార పార్టీలో ఆధిపత్య పోరు

0 2

నిజామాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోట అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ జిల్లాపై పెత్తనం కోసం ఎవ్వరికి వారు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం వద్ధ అంతా సవ్యంగా ఉందని చెబుతున్నా.. జిల్లాకు వచ్చేసరికి ఆధిపత్య పోరులో ఎవ్వరికి వారు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలతో జిల్లా పార్టీలో ఉన్న లుకలుకలు బహిర్గతమౌతునే ఉన్నాయి. ఇటీవల పోరుగు జిల్లాలో సీయం పర్యటన కోసం నిజామాబాద్ లో అగడం మొదలుకోని, జిల్లాలో సీయం పర్యటన కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఎవ్వరికి వారు తమ ఆధిపత్య ప్రదర్శన చూపుతున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం ఎవ్వరి కనుసన్నల్లో పనిచేయాలి.. జిల్లాపై పెత్తనం ఎవ్వరికి అనే విషయంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ విషయంపై ఇటీవల ఏకంగా కోందరు సీయం కేసీఆర్‌కు ఫిర్యాదు కుడా చేసినట్లు తెలిసింది. ఈ నెల 20న సీయం కేసీఆర్ కామారెడ్డి జిల్లా అధికార పర్యటన సందర్బంగా పార్టీ ముఖ్యులతో దాని గురించి చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.2018లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల తరువాత ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరికే అవకాశం దక్కింది.

 

 

 

- Advertisement -

ఉమ్మడి జిల్లాలో సీనియర్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సభాపతి కావడం, అ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఓటమితో ఉమ్మడి జిల్లాలో అంతా వేముల ప్రశాంత్ రెడ్డి కనుసన్నులలో వ్యవహరం జరిగింది. పోరుగు నియోజకవర్గాలలో కాలు పెట్టకున్నా ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగాలపై పట్టుసాధించారు. జిల్లా కలెక్టర్ ల బదిలీలు మొదలుకోని, ఏది జరగాలన్నా అంతా వేముల చెప్పినట్లే జరిగింది. అయితే వేములతో పాటు గెలిచిన చాలామంది శాసనసభ్యులకు, సీనియర్‌లకు వేముల పెత్తనంను ఎన్నడూ అంగీకరించలేదు. అందుకు అనుగుణంగా సీయం కేసీఆర్‌తో వారికి ఉన్న సంబంధాలతో వారు పెద్ధగా వేముల అదేశాలను ఎన్నడూ ఖాతర్ చేయలేదు కూడా.. ఎందుకంటే జిల్లాలో జిల్లా పరిషత్, డిసిసిబి ఎన్నికలలో మంత్రి ఎవ్వరు చెప్పిన పట్టించుకోకపోవడంతో సీయం కేసీఆర్ వద్ధ ఉన్న పతేరాతో వాళ్లు పదలను తెచ్చుకున్నారు.కానీ ఒక్కరు కుడా ప్రశాంత్ రెడ్డి చెప్పిన వారికి పదవులు రాకపోవడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గడిచిన ఏడాది స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి ఉప ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గెలిచిన తరువాత వేముల ప్రశాంత్ రెడ్డి అధిపత్యానికి మొదటిసారి గండి పడిందని చెప్పవచ్చు. నాటి నుంచి కుడా సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా రాజకీయాల గురించి పెద్ధగా పట్టించుకోలేదు.

 

 

 

దానితో సీయం కేసీఆర్ వద్ధ తనకు ఉన్న చనువుతో జిల్లాలో పార్టీ మొదలుకోని అధికార పెత్తనం అంతా వేముల చేప్పినట్టే జరిగింది. కానీ అన్ని పరిస్థితులు ఓకేలా ఉండవన్న చందంగా కరోనాను ముందు కవిత నెలలో ఐదు రోజులు నిజామాబాద్ లో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం , ప్రజలు, అధికారులు ఆమెను నేరుగా కలువడం మంత్రికి నచ్చలేదని సమాచారం.కవిత కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి హైద్రాబాద్ కు పరిమితం కాగా.. కరోనా సెకండ్ వేవ్ లో ఉమ్మడి జిల్లాలో సమీక్షలు మొదలుకుని అన్ని మంత్రి చెప్పినట్లే జరిగాయి. కానీ లాక్ డౌన్ సడలింపులు మొదలుకావడం, ఉమ్మడి జిల్లాలో సీయం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ రావడంతోనే అధికార పార్టీ నేతలలో ఉన్న లుకలుకలు బహిర్గతమయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7న ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టులు పేదవారికి ఉచితంగా అందించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో మాత్రం 6వ తేదీనే నిర్వహించడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు. జిల్లా మంత్రి హోదాలో ప్రశాంత్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి ప్రారంభించడం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు.ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ తండ్రి సురేష్ పరమపదించడంతో సీయం కేసీఆర్ మెట్ పల్లిలో వారి కుటుంబాన్ని పరామార్శించారు.

 

 

 

మెట్ పల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కేసీఆర్ వేల్పూర్ లో వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేంధర్ రెడ్డి విగ్రాహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అప్పటికప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను తన క్యాంపు కార్యాలయంకు రప్పించారు. కేవలం కేసీఆర్ వద్ధ తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని చాటాడానికి జీవన్ రెడ్డి పట్టుదలగా క్యాంపు కార్యాలయంకు రప్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాపై పెత్తనం విషయంలో అక్కడ కుడా పెచి కోనసాగుతుంది. తరుచూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ అధికారులతో సమీక్షలను నిర్వహించడంతో పాటు, అధికారిక పర్యటనలు చే మింగుడు పడటం లేదని సమాచారం.నెల 20న కామారెడ్డి జిల్లాలో అధికారిక పర్యటన సందర్బంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యులతో సమావేశంకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సూమారు 300 మంది నేతలతో ఈ సమావేశం జరుగుతుందని, అక్కడ కేసీఆర్ అందరి సమక్షంలో పంచాయతీని తేల్చివేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

 

Dominance struggle in the ruling party

 

Tags: Dominance struggle in the ruling party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page