ఆలయం ముందు నిరసన

0 33

వేములవాడ ముచ్చట్లు:

 

 

ముఖ్యమంత్రి మీరు వేములవాడ క్షేత్రానికి  వచ్చి నేటి తో 6 సంవత్సరం లు అవుతుందని,  ప్రతి యేటా 100 కోట్లు బడ్జెట్ ఇస్తాని శ్రీ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా చెప్పావు, నీ మాట ఏమైంద ని కాంగేస్ నాయకులు ఆలయం ముందు నిరసన తెలుపారు.తెలంగాణ ప్రభుత్వం కు, కేసీఆర్ జుటా మాటల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్  18 జూన్ 2015 నాడు ఈ వేములవాడ క్షేత్రానికి వచ్చి నా పెళ్లి ఈ ఆలయంలో జరిగింది, ఈ ఆలయ అభివృద్ధి కి ప్రతి యేటా 100 కోట్లు బడ్జెట్ పెడుతా, తక్షణమే వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్వామి వారి సాక్షిగ చెపుతున్న అని చెప్పిన ఆ మాట ఏమైందని ప్రశ్నించారు.  వంద కోట్లు లేదు వంద పైసలు కూడ ఇప్పటివరకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు కల్పిస్తా అని, వారి జాగలో కట్టుకుంటే వారికి ఐదు లక్షల నాలుగు వెయులు తక్షణమే మంజూరు చేస్తామని కూడ కేసీఆర్ చెపాడని, ఆయన నోటి మాటలు నీటి మూటలు మాత్రమే అని హెద్దవచేశారు. ఈ జూటబాయ్ మాటలు ప్రజలు గమణిస్తున్నారని, రాజరాజేశ్వర స్వామి ముందు చెప్పిన వాటిని అమలు చేయలేదు కాబట్టి నీ పాపం పండుతుందని, ఇక నీకు శాపము తప్పదని వెల్లడించారు.  వేములవాడ ప్రజలు అల్లాడుతుంటే  మా ఎమ్మెల్యే 15 ఏండ్లుగా పత్తాలేకుండా పోయి విదేశాల్లో విలాస జీవనము గడుపుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, సంఘ స్వామి, కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Protest in front of the temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page