ప్రజారోగ్యమే ఎమ్మెల్యే ధ్యేయం

0 84

రామసముద్రం ముచ్చట్లు:

 

 

ప్రజారోగ్యమే మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం కెసిపల్లి పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి గ్రామంలో ఓ మహిళకు కరోన పాజిటివ్ రావడంతో కరోన పరీక్షలు నిర్వహించారు. అలాగే కరోన భారిన పడిన వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సకాలంలో స్పందించాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలు అధికారులను ఆదేశించారన్నారు. అదే విధంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పంచాయతీలో నమోదు అవుతున్న కరోన కేసుల వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట తిరక్కుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రాధాకృష్ణ, ఏఎన్ఏం సుగుణమ్మ, ఆశ వర్కర్లు రాధమ్మ, మంజుల, వాలింటర్లు శ్రావణి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Public health is the goal of the MLA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page