ముంపు ప్రాంతాల్లో రానున్న వరద ప్రవాహం అంచనా

0 17

– ప్రజలను సురక్షిత మైన ప్రాంతాలకు తరలించేలా ముందస్తు కార్యాచరణ
-జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి

 

ఏలూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లో రానున్న వరద ప్రవాహాన్ని అంచనావేసి, ప్రజలను సురక్షిత మైన ప్రాంతాలకు తరలించేలా ముందస్తు కార్యాచరణ తో సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ విడిది సమావేశ మందిరంలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక, ఐసిడిఎస్, ఆర్ డబ్ల్యు ఎస్, విద్యుత్, తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లో ప్రజలను తరలింపు, తదుపరి చర్యలపై ఆయా శాఖలు  నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. 2019, 2020 సంవత్సరాల లో చేపట్టిన పనులను పునః సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణ ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.  ప్రస్తుతం ముంపు గ్రామాలలో వరద ఉధృతి అంచనా వేసి, వాటికి అదనంగా మరో ఆరు మీటర్లు ప్లస్ రెండు  మీటర్లు ప్రవాహం వస్తే ఎదుర్కొనేలా అంచనా వేసి, చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

 

 

పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ని 19 గ్రామాలు ముంపునకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని, అక్కడ వారిని సురక్షితంగా తరలించేందుకు పూర్తి నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలన్నారు. అందులో ప్రతి ఒక్క శాఖ స్థానికంగా ఉండే అధికారుల, సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడే చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క శాఖ నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని స్పష్టం చేశారు.స్పిల్వే గేట్ ల నిర్మాణం పూర్తి చేసుకుని, వరద నీటి ప్రవాహం స్థితి గతులు అంచనా వేయాలన్నారు. గతంలో అప్పర్ కాపర్ డాం గ్యాప్ లనుంచి  నీటి ప్రవాహం మళ్లించేవారమన్నారు. ప్రస్తుతం పరిస్థితికి అనుగుణంగా ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.  వరద ముంపు ప్రాంతాల్లో ఎన్ని లక్షలు క్యూసెక్కులు నీటి పారుదల ఉంటే ఏఏ గ్రామాలు ముంపు అవుతాయో ఇరిగేషన్ శాఖ అంచనా వేసి, ఆరు మీటర్లు అదనంగా నివేదిక రూపొందించినట్లు అధికారులు జేసి కి వివరించారు. అందుకు అదనంగా మరో రెండు మీటర్లు ఎత్తు వరకు మనం క్షేత్రస్థాయిలో సంసిద్ధత తో ఉండాలని జేసి సూచించారు.ముంపుకు గురైయ్యే గ్రామాలకు కావాల్సిన నిత్యావసర సరుకుల, మెడికల్, శానిటేషన్ తదితర వివరాలకు అనుగుణంగా స్టాకును తరలించాలని జేసి ఆదేశించారు.

 

 

 

 

ముంపు గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించే చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో బోట్స్ కూడా నిర్ణిత ప్రదేశాల్లో సిద్ధం చేసుకోవాలన్నారు. గత ఏడాది పోలీస్, రెవిన్యూ , ఇరిగేషన్ అధికారులు సమర్థవంతంగా పనిచేశారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. గర్భిణీ స్త్రీలు, మహిళలు, వృద్ధులు,  పిల్లల సంరక్షణ చర్యలతో మెడికల్ డిపార్ట్మెంట్ వారు అవసరమైన మందులు, ఐసీడీఏస్ అధికారులు పౌష్టికాహారం వంటి వారిని అంచనా వెయ్యలని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు నిత్యావసర సరుకుల అంచనాకు ముందు రావాల్సి వుంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పశుగణన మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్.ఇ. పోలవరం కె. నరసింహమూర్తి, ఆర్డీఓ జేఆర్ గూడెం, పిఓ ఐటీడీ (ఇంచార్జ్) వై వి లక్ష్మీ ప్రసన్న,ఎస్ ఈ ఇరిగేషన్ ఎంఎస్ఎస్ రవిబాబు,ఎస్ ఈ ఆర్ డబ్ల్యూఎస్  వి.రామస్వామి, ఇఇ  ఆర్ అండ్ బి బి.రాము, ఇఇ ట్రైబల్ వెల్ఫేర్ డివిఆర్ఎం రాజు, డీఎస్ ఓ ఎన్. సుబ్బరాజు, డీపీఓ కె. రమేష్ బాబు, ఐ సి డి ఎస్ పీడీ విజయ కుమారి,  డిఎం హెచ్ ఓ డా. సునంద, ట్రాన్స్ కో ఎస్ ఈ డి. రాజేంద్రప్రసాద్, హోసింగ్ ఈఈ బి. తారచంద్ , ఎంపిడిఓ సీహెచ్ శ్రీనివాసరావు, సిఐ  ఏ. నరసింహ మూర్తి, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు  తదితరులు పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు రూపొందించిన ప్రణాళికను సమావేశంలో అధికారులు వివరించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Estimation of impending flood flow in flooded areas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page