రఘురామకు మంత్రి పదవి. 

0 128

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

దేశం ప్రభుత్వంలో ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఉండేవారు. బీజేపీ టీడీపీ మిత్రులు కావడంతో పూసపాటి అశోక్ గజపతిరాజుతో పాటు, సుజనా చౌదరికి కేంద్ర మంత్రుల యోగం పట్టింది. ఇక ఏపీ నుంచి రాజ్యసభకు నెగ్గిన సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడి కోటాగానే పరిగణించేవారు. మొత్తానికి నాడు కేంద్రంతో మాటా మంత్రి జరపడానికి నేరుగా కేంద్ర మంత్రులు ఉండేవారు. ఫలితాలు పర్యవసానాలు పక్కన పెడితే ఒక లింక్ అంటూ ఉండేది. ఇపుడు చూస్తే రెండేళ్ళు గడచినా కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యమే లేదు.పొరుగున ఉన్న తెలంగాణా తీసుకుంటే కిషన్ రెడ్డి హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరో విడత విస్తరణలో ఇంకో పదవి కూడా తెలంగాణాకు ఇస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి అక్కడ బీజేపీకి నలుగురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. ఏపీలో చూస్తే మరి కొద్ది నెలల్లో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన రాజ్య సభ సభ్యులు కూడా పదవీ విరమణ చేస్తారు. దాంతో ఏపీ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా ఉన్నారని చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు నెగ్గారు.

 

 

- Advertisement -

ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కొంతలో కొంత నయమే కానీ ఆయనకు కులమే మైనస్ గా ఉందని అంటున్నారు.ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ లేరని మధనపడకుండా ఒకే ఒక్కడు అన్నట్లుగా నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు ఉన్నారు. ఆయన గెలిచిన తరువాత నుంచి బీజేపీకి అనధికార ఎంపీగానే ఉంటూ వస్తున్నారు. ఆయనకు నేరుగా కేంద్ర మంత్రులతో అపాయింట్లుమెంట్లు కూడా దక్కుతున్నాయి. ఏపీలో వైసీపీని ఇబ్బంది పెడుతూ ఈ ఎంపీ ఉంటే ఆయన్ని బీజేపీ వెనకేసుకువస్తోందన్న ప్రచారం ఉంది. ఇదంతా అందరికీ తెలిసిన రాజకీయమే అయినపుడు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు. ఆయనకే రేపు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేస్తే పోలా అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని అందులో నలుగురుని మంత్రులుగా చంద్రబాబు చేయగా లేనిది రాజుకి బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇస్తే తప్పేముంది. పైగా బీజేపీ మార్క్ రాజకీయాలు కూడా ఇలాగే ఉంటాయి కాదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమో ఇవాళ రాజు గా ఢిల్లీలో అదరగొడుతున్న రఘురామ రేపు మంత్రిగా అవతరించినా ఆశ్చర్యం లేదు అన్న మాట కూడా ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అంతే.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Ministerial post for Raghuram.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page