వానాకాలంతో రోగాలు

0 5

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వానాకాలం ప్రారంభమైంది. సీజనల్‌ వ్యాధుల ముప్పూ పొంచి ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సరైన వైద్యమందక ఎంతోమంది ప్రాణం కోల్పోయారు. ఇప్పుడు వానాకాలం రావడంతో సాధారణ సీజనల్‌ రోగాలూ ప్రబలే ప్రమాదం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం సాధారణ పరీక్షలకే పరిమితమవుతున్నది. ప్రభుత్వ వైద్యరంగాన్ని, జిల్లా కేంద్ర, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తామనీ, డాక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తామనీ, మందుల కొరత లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది అమలు జరగటంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలను గాలికొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనుల పరిస్థితి మరీ దారుణం. ఆస్పత్రులకు చేరుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ చూస్తుండటంతో.. ప్రభుత్వ ఆస్పత్రుల దిశ మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పీహెచ్‌సీ, అర్బన్‌హెల్త్‌, సబ్‌సెంటర్లు కలుపుకుని 97వరకు ఉన్నాయి. ఇవి గతేడాది నుంచి కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలుగానే మిగిలిపోతు న్నాయి. సాధారణ జ్వరం, ఇతర రోగాలబారిన పడిన వారికి కనీస వైద్యం అందించడం లేదు.

 

 

 

- Advertisement -

దానికితోడు ఇటీవల వ్యాక్సిన్‌ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇతర రోగా లకు కనీస ప్రాథమిక చికిత్స దొరికే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలందించే సిబ్బంది ఖాళీలు 12వేలకుపైగా ఉండగా.. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోనే సుమారు 2500వరకు ఉన్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక ప్రభుత్వఉద్యోగ, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌లో కనీస మందులు కరువయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 22 పిహెచ్‌సీ, ఒక ఆర్బన్‌ హాస్పిటల్‌, జిల్లా కేంద్ర హస్పిటల్‌ ఉన్నాయి. సూర్యపేట, తుంగతుర్తి, హూజుర్‌ నగర్‌, కోదాడ కేంద్రాలలో నాలుగు ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మందుల కొరతలేకున్నా వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. యాదాద్రి జిల్లాలో వైద్యసిబ్బంది ఖాళీలున్నాయి. నర్సు పోస్టులు ఎక్కువగా ఖాళీలున్నాయని అధికారులు తెలిపారుఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అనేక ఏండ్లుగా వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో పేదల కు సర్కారు వైద్యం సరిగా అందడం లేదు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే వైద్యులు, సిబ్బంది కలిపి 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి అధ్వానంగా మారింది. నార్నూర్‌ మండలంలో 30పడకల ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉంది.

 

 

 

 

కానీ ఒకే ఒక్కరు ఉండటంతో పేదలకు సకాలంలో వైద్య సేవలు అందడంగగనంగా మారింది.మహబూబ్‌నగర్‌ జిల్లాలో 306వైద్య పోస్టులకు గాను నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గద్వాల జిల్లాలో 110 పోస్టులకుగాను 22 ఖాళీగా ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 78 పోస్టులకుగాను 19 ఖాళీగా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 73 పోస్టులకు గాను 27 ఖాళీగా ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో 137 వైద్య పోస్టులు ఉండాల్సి ఉండగా, 56 ఖాళీలు ఉన్నాయి. 250 నర్స్‌ పోస్టులు, 125 సాంకేతిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు రోగం వస్తే నలభై కిలోమీటర్లు నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన వ్యక్తి కరోనా బారిన పడి కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరాడు. వైద్యం పొందుతూనే పరిస్థితి విషమించి మరణించాడు. ఆయన మృతదేహాన్ని తరలించకుం డా రోజంతా ఉంచడంతో వార్డులోని ఇతర రోగులు భయబ్రాంతులకు గురయ్యారు.

 

 

 

మరో ఘటనలో సాక్షాత్తు కరీంనగర్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సంజీవ్‌ తల్లి కరోనా బారిన పడటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చాడు. తాను ఫలానా ఉద్యోగం చేస్తానని చెప్పినా చికిత్స చేసే వాళ్లు అందుబాటులోకి రాలేదు. దీంతో అతని తల్లి రెండు రోజుల కిందట ఆస్పత్రిలోనే ప్రాణం విడిచింది. ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా తన తల్లి బతికి ఉండేదని కానిస్టేబుల్‌ బోరున విల పించాడు. పని ఒత్తిడిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, సరిపడా ఉద్యోగులు లేక చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యకృత్యం.రీంనగర్‌, జగిత్యాల జిల్లాలతోపాటు మరికొన్ని చోట్ల ప్రభుత్వ డయాగస్టిక్‌ సెంటర్లు ప్రారంభమ య్యాయి. అందులో ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదు. ప్రస్తుతం రక్త, మూత్ర పరీక్షల వరకే తీసుకుంటున్నారు. పూర్తిస్థాయి సిబ్బంది వచ్చాక మిగతా పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Diseases with monsoon

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page