సీమలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు

0 17

-పెసరవాయిలో లోకేష్ పర్యటన

 

కర్నూలు ముచ్చట్లు:

 

- Advertisement -

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం పెసరవాయిలో నారా లోకేష్ పర్యటించారు.  గురువారం హత్యకు గురయిన టీడీపీ నేతల కుటుంబాలను పరామర్శించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అసలు అవతారం బయటపడింది.ఆయన జగన్ రెడ్డి కాదు ఫ్యాక్షన్ రెడ్డి అని రెండేళ్ల పాలనలో తేలిపోయింది. ఫ్యాక్షన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాడని ఆరోపంచారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మళ్లీ రక్తం పారిస్తున్నారు. టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాం.  ఫ్యాక్షన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు.24 గంటలూ ఒక్కటే ఆలోచన ప్రతిపక్ష పార్టీ నాయకుల పై దాడులు,అరెస్టులు,హత్యలు.  ప్రశ్నించిన టిడిపి నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారు.ఈ మధ్య జరిగిన ఘటన మీ అందరికీ తెలుసు బనగానపల్లె లో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి   ఇంటిపై వైకాపా రౌడీలు దాడికి ప్రయత్నించారు.దాడిని అడ్డుకున్న బిసి జనార్దన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసారు.

 

 

 

 

 

పాణ్యం నియోజకవర్గం,పెసరవాయిలో టిడిపి నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర రెడ్డి గారిని,వారి సోదరుడు, గడివేముల మాజీ సహకార సంఘం ప్రెసిడెంట్ వడ్డు ప్రతాప్ రెడ్డి గారిని వైకాపా ఫ్యాక్షనిస్టులు అత్యంత దారుణంగా హత్య చేసారు. వైకాపా ఫ్యాక్షనిస్టులు శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ధామోధర్ రెడ్డి లు 15 మంది అనుచరులతో తమ సొంత రెండు వాహానాల్లో వెనుక వైపు నుండి ఢీ కొట్టారు.  క్రింద పడిన వారి పై శ్రీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, ధామోధర్ రెడ్డి లు తమ అనుచరులతో కలసి వేట కొడవళ్లతో మూకుమ్మడిగా దాడి చేసి నరికారు.  దాడిలో ఇద్దరు అన్నదమ్ములు నాగేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి లు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో గాయపడిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర్లులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు అడ్డుపడ్డారు అనే కక్షతో కిరాతకంగా హత్య చేసారు.

 

 

 

 

ఇద్దరు అన్నదమ్ములు పాణ్యం వైసిపి ఎమ్మెల్యే నుండి తమకు ప్రాణ హాణి ఉందని,తమకు రక్షణ కల్పించాలని అనేక సార్లు పోలీసులను కోరినా పట్టించుకోలేదని విమర్శించారు.  దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు ఉన్నాయి.మొత్తం రికార్డ్ అయ్యింది.అయినా ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు. వైకాపా యూనిఫామ్ వేసుకున్న కొంతమంది పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగానికి బానిసలుగా మారారని అయన మండిపడ్డారు. వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుంది.తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర్లులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.పార్టీ వారికి అన్నీ విధాలుగా అండగా ఉంటుందని అయన అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Faction politics again in Europe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page