అంటురోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 96

రామసముద్రం ముచ్చట్లు:

అంటురోగాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి గ్రామంలో 104 సేవలతో పాటు మలేరియా పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందుతాయని, ఆ దోమకాటుకు గురైన వారు మలేరియా భారిన పడే అవకాశం ఉందన్నారు. మురికినీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసుకోవలన్నారు. ప్రజలు ఇళ్లల్లో దోమ తెరలు, వేపాకు పొగ వేసుకోవాలని సూచనలు ఇచ్చారు. వారంలో ఒక్క రోజు డ్రై డే పాటించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా ఆదేశాల మేరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా 104 సేవలు నిర్వహించి నిరుపేదలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం పలువురికి 104 ద్వారా చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, 104 డాక్టర్ లేఖ్య, 104 ఆపరేటర్ సెల్వి, ఏఎన్ఏం సుగుణమ్మ, స్థానిక నాయకులు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, రెడ్డెప్పరెడ్డి, వెంకటరమణ, శివకుమార్, శివశంకర్, నాగరాజ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, వాలింటర్లు శ్రావణి, వెంకటరమణ, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Be vigilant against infections
– Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page