ఇక పొలిటికల్ మల్టీస్టారర్..

0 38

హైదరాబాద్  ముచ్చట్లు:
సినిమాల్లో మల్టీస్టారర్ కి ఎపుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోల అభిమానులు కలసి సినిమాను చూస్తారు. గ్యారంటీగా బొమ్మ బాక్స్ బద్దలు కొడుతుంది అన్న లెక్కలేవో ఉంటాయి. రాజకీయాల్లో అలాంటి మల్టీ స్టారర్లు హిట్లు అయ్యాయా అంటే కొన్ని చోట్ల జరిగాయి. కానీ చాలా సార్లు ఫెయిల్ అయ్యాయి. ఈ మధ్యనే తమిళనాడు లో కమల్ హాసన్ శరత్ కుమార్ ల పొలిటికల్ మల్టీ స్టారర్ ని జనం తిరస్కరించారు. దాని కంటే కొన్ని దశాబ్దాల ముందు ఎమ్జీయార్, కరుణానిధి కాంబోకు జనం జేజేలు పలికారు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు కూడా.తెలుగు సినీ రంగాన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉంటారు. ఇద్దరికీ అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరి సినిమాలు రిలీజ్ అయితే సినిమా హాళ్ల వద్ద జాతర వాతావరణమే కనిపిస్తుంది. అయితే ఇద్దరూ రాజకీయాల్లో మాత్రం ఫ్లాప్ అయ్యారు. విడిగా వెళ్లి ఇద్దరూ తమ బొమ్మ డిజాస్టర్ అన్న టాక్ తెచ్చుకున్నారు. కానీ ఇపుడు ఈ ఇద్దరూ కలసి వస్తే ఎలా ఉంటుంది. ఇదే బీజేపీ ఆలోచనట. ఇద్దరినీ వెండి తెర మీద హీరోలుగా పెట్టి సుబ్బరామిరెడ్డి సినిమా తీయాలనుకున్నారు కానీ అది కుదరలేదు, మరి బీజేపీ పొలిటికల్ మూవీ సాధ్యమేనా?రాజకీయాల్లో జనాలను తమ వైపునకు తిప్పుకోవడమే అతి పెద్ద ఆర్ట్. ఎన్టీయార్ సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తూనే జనాలను సూదంటు రాయిలా ఆకట్టుకున్నాడు. ఆయనలో నాయకుడిని జనాలు చూశారు, ఓటేశారు.

చిరంజీవి, పవన్ ల విషయం వస్తే వెండి తెర వేలుపులుగానే ఇప్పటికీ చూస్తున్నారు. అయితే వారు రాజకీయాల వైపు మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడానికి ఏపీలో అతి పెద్ద సామాజికవర్గమే కారణం అంటున్నారు. టీడీపీ వైసీపీ రెండు ప్రధాన కులాలకు నాయకత్వం వహిస్తున్నాయి అన్న భావన ఉన్న చోట తమకెందుకు రాజకీయ పార్టీ ఉండరాదు అని కాపులు భావిస్తే మాత్రం ఈ పొలిటికల్ మల్టీస్టార్ సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. బీజేపీ కూడా కాపులనే నమ్ముకుంటోందిట.జగన్ ని ఒక పట్టు పట్టడానికి 2024 ఎన్నికలే చివరి అవకాశం అని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. జగన్ రెండవసారి కూడా అధికారం చేపడితే మాత్రం ఆయన బలమైన పునాదులు వేసుకుంటారు. ఆ మీదట కదిలించడం కష్టమే అన్న మాట కూడా ఉంది. అందుకే చిరంజీవి, పవన్ లను కలిపి అయినా ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. మరో వైపు చిరంజీవిని తేవడం ద్వారా టీడీపీ పొత్తుకు ససేమిరా అనాలన్నది బీజేపీ ఆలోచనట. అదే జరిగితే ఏపీలో ట్రయాంగిల్ పోరు జరుగుతుంది. అది కచ్చితంగా వైసీపీకే అడ్వాంటేజ్ గా ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి ఏపీలో బలం లేదు. జనసేన ఇంకా బాల్య దశలో ఉంది. మెగాస్టార్ వచ్చినా కూడా ఈ కూటమికి చాన్స్ ఉంటుందా అంటే చూడాల్సిందే.
పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags;’And the political multistarrer ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page