కడప జిల్లాలో దారుణం

0 30

కడప ముచ్చట్లు :

 

తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శిరీష అనే యువతిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది చరణ్‌ను ఉరితీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తన కూతురు ప్రాణం తీసిన ఆ కిరాతకుడిని వెంటనే ఉరి తీయాలని శిరీష తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరుతున్నారు. తన కూతురి ప్రాణం తీసిన చరణ్‌కు భూమ్మీద బ్రతికే అర్హత లేదంటున్నారు.కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీషను చరణ్‌ శుక్రవారం గొంతు కోసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. డిగ్రీ చదువుతున్న శిరీషను అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్‌ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన వెంట ఎన్నిసార్లు తిరిగినా ప్రేమను అంగీకరించనని ఇటీవలే శిరీష అతడికి తెగేసి చెప్పింది.దీంతో కక్ష పెంచుకున్న చరణ్ శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో గొంతు కోశాడు. గట్టిగా కేకలు వేస్తూ శిరీష కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

 

- Advertisement -

అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శిరీష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శిరీష ప్రాణాలు తీసిన చరణ్‌ను గ్రామస్థులు పట్టుకొని విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు బద్వేలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. చరణ్‌ను ఈరోజు డిశ్చార్జ్ చేసే అవకాశముండటంతో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.మరోవైపు తమ కూతురిని పొట్టన పెట్టుకున్న చరణ్‌ను ఉరి తీయాలంటూ శిరీష కుటుంబసభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసుల కాళ్లపై పడిన ఘటన అందరినీ కలిచివేసింది. మరోవైపు ఈ ఘటనపై చరణ్‌ తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఇంత కిరాతకుడని తాము తెలుసుకోలేకపోయాయని, పేరంట్స్ వాపోతున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Atrocities in Kadapa district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page