కమలం ఆశలు ఫలించేనా

0 30

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అవసరమైన అన్ని చర్యలు మూడేళ్ల ముందు నుంచే ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా నమ్మకం ఏర్పడింది. దీంతో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలను ఇక్కడ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించింది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది.పశ్చిమ బెంగాల్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయినా మెరుగైన స్థానాలను సాధించగలిగింది. మూడేళ్ల ముుందు నుంచే అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అదే తరహాలో తెలంగాణాలోనూ బీజేపీని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అధ్యయనం చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుమాత్రమే బీజేపీ సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించి తమకు తెలంగాణలో పట్టు ఉందని నిరూపించుకోగలిగింది. కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను సాధించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడంతో కేంద్ర నాయకత్వానికి కూడా హోప్స్ పెరిగాయి.అందుకోసమే బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకాష్ జీని ప్రత్యకంగా రంగంలోకి దించిది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ప్రకాష్ జీ ముఖ్య పాత్ర పోషించారు. దీంతో ఆయనకు తెలంగాణ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది. చేరికల విషయంలో ప్రకాష్ జీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అందుకే ఆయనను బీజేపీ రంగంలోకి దించింది. మొత్తం మీద తెలంగాణలోనూ బీజేపీ బెంగాల్ తరహా వ్యూహాన్ని అనుసరించాలని డిసైడ్ అయినట్లుంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Lotus hopes come true

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page